Like 9/11 Attack: రష్యా దాడులను 9/11 ఉగ్ర దాడితో పోల్చిన యుక్రెయిన్!

రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆధునిక ఆయుధాలు, బాంబులు, క్షిపణులతో రష్యా దాడులు చేస్తోంది.

Like 9/11 Attack:  రష్యా దాడులను 9/11 ఉగ్ర దాడితో పోల్చిన యుక్రెయిన్!

New York

Like 9/11 Attack: రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆధునిక ఆయుధాలు, బాంబులు, క్షిపణులతో రష్యా దాడులు చేస్తోంది. ఇప్పటివరకు ఒంటరిగానే పోరాడిన యుక్రెయిన్‌కు ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ దొరుకుతోంది. మరోవైపు రష్యా మాత్రం తగ్గేదే లే అంటూ సైన్యంతో దాడులు చేయిస్తోంది. ఈ క్రమంలోనే కీవ్‌లోని భవనంపై క్షిపణులతో దాడి చేశారు రష్యా సైనికులు.

అయితే, ఈ దాడులను యూఎస్ 9/11 దాడులతో పోలుస్తూ యుక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడులను పోల్చిన చిత్రాన్ని యుక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పై 9/11 ఉగ్రవాద దాడి తరువాత పొగ కనిపిస్తుంది. అలాగే, చిత్రంలో కీవ్‌లో రష్యా దాడి సమయంలో, క్షిపణి దాడికి గురై దెబ్బతిన్న భవనం కనిపిస్తుంది.

కీవ్‌లోని భవనంపై రష్యా క్షిపణి దాడిని యుక్రెయిన్ అమెరికాలో 9/11లో జరిగిన దాడితో పోల్చింది. అదే సమయంలో, రష్యా రాయబారులను తమ తమ దేశాల నుంచి తొలగించాలని యుక్రెయిన్ ప్రపంచంలోని అన్ని దేశాలను కోరింది. మీడియా కథనాల ప్రకారం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తోందని, రాబోయే కాలంలో క్షిపణి దాడుల సంఖ్య పెరగవచ్చని, దీని వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. యుక్రెయిన్‌లోని సాధారణ ప్రజలు కూడా రష్యా దాడుల దెబ్బకు బలవుతున్నారు.

రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి యుక్రెయిన్‌లోని 821 సైనిక స్థావరాలను సైన్యం లక్ష్యంగా చేసుకుంది. 14 విమానాశ్రయాలు, 19 మిలిటరీ కమాండ్ సెంటర్లతో సహా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనితో పాటు, 24 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలతో సహా అనేక డ్రోన్లు మరియు ట్యాంకులు ధ్వంసమయ్యాయి.