Peru Earthquake : పెరూలో భారీ భూకంపం

రూలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:52గంటల సమయంలో

Peru Earthquake : పెరూలో భారీ భూకంపం

Peru

Peru Earthquake  పెరూలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:52గంటల సమయంలో బరాన్కా పట్టణానికి ఉత్తరాణ 42 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. భారీ భూంకంపం ధాటికి జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టగా.. భవనాలు ఊగిపోయాయి. ప్రకంపనల ధాటికి భవనాలు ఊగిపోయిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

అయితే భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. లోతు(100కి.మీ) కూడా అధికంగా ఉండటం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదు. భూకంపం ధాటికి 16వ శతాబ్దానికి చెందిన ఓ పాత కాథోలిక్​ ఆలయ టవర్​ కూలిపోయింది. ఇతర ప్రాంతాల్లో కొన్ని చర్చి​లు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులు, ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.

భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్‌ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది. కాగా,పెరూలో భూకంపాలు సాధారణమైన విషయం. భూమిపై 85శాతం భూకంపాలు.. పెరూ ఉన్న రింగ్​ ఆఫ్​ ఫైర్​లోనే సంభిస్తాయి.

ALSO READ Nitish Kumar : బీహార్ సీఎంపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఆరోపణలు