Malala Yousafzai : తాలిబన్ల చేతుల్లోకి అప్ఘానిస్తాన్..ఆందోళనగా ఉందన్న మలాలా

అఫ్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో అక్కడి పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ఆయా దేశాలు, ప్రముఖులు ఆందోళన

Malala Yousafzai : తాలిబన్ల చేతుల్లోకి అప్ఘానిస్తాన్..ఆందోళనగా ఉందన్న మలాలా

Malala

Malala Yousafzai అఫ్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో అక్కడి పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ఆయా దేశాలు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడి మహిళల భవిష్యత్తుపై విద్యాహక్కుల కార్యకర్త,నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసష్ జాయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మలాలా ఆదివారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు.

మలాలా తన ట్వీట్‌ లో..అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడం చూసి మేం పూర్తిగా షాకయ్యాం. అక్కడి మహిళలు, మైనారిటీలు, మానవ హక్కుల కార్యకర్తల విషయమై తీవ్ర ఆందోళన చెందుతున్నా.ప్రపంచ దేశాలు, స్థానిక సంస్థలు.. తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలి. మానవతా దృక్పథంతో అక్కడున్న వారికి సహాయం అందించాలి. పౌరులు, శరణార్థులను రక్షించాలి అని పేర్కొన్నారు.

కాగా,తాలిబాన్ల ఆజ్ఞలను ధిక్కరించి అమ్మాయిలూ చదువుకోవాలనే ఆకాంక్షతో తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న మలాలా గురించి అందరికీ తెలిసిందే. వాయువ్య పాకిస్తాన్ లోని మింగోరాలో 1997న జన్మించిన మలాలా..15 ఏళ్ల వయసులోనే స్వదేశమైన పాకిస్తాన్‌లో అమ్మాయిలకు విద్య అవసరమని పోరాడుతుండగా, తాలిబన్ మిలిటంట్లు ఆమెపై కాల్పులు జరిపారు.

2012లో ఒకరోజు స్కూలు స్వాత్ వ్యాలీలో స్కూల్ లో పరీక్ష రాసి బస్సులో ఇంటికి తిరిగి ఇంటికెళ్తున్న మలాలాపై తాలిబన్ ప్రతినిధి ఎహ్‌షానుల్లా ఎహ్సాన్ కాల్పులు జరిపాడు. విద్య అనేది బాలల హక్కు అని పోరాడిన మలాలాపై తాలిబన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో తీవ్రంగా గాయపడింది. బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు మలాలా గెలిచింది. పూర్తిగా కోలుకున్న మమలా ప్రస్తుతం మహిళల విద్యాహక్కు కోసం ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో 2014లో ఆమె నోబెల్ బహుమతి కూడా గెలుచుకున్నారు. మలాలా ఒక స్పూర్తి ప్రదాత అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా సైతం కొనియాడిన సంగతి తెలిసిందే.

మలాలా ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో తన తల్లితండ్రులతో కలిసి ఉంటున్నారు. పాకిస్తాన్‌లో ఆమెపై హత్యాయత్నం జరిగిన తరువాత ఆమె కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది. మలాలా ఒక స్పూర్తి ప్రదాత అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా సైతం కొనియాడిన విషయం తెలిసిందే.