Malaysia : ఇతని లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు

ఓ వ్యక్తి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు. ఇతనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన వారంతా పాపం..అంటున్నారు.

Malaysia : ఇతని లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు

Malaysia Security Guard

security guard lunch : సామాన్యుడి నుంచి మొదలకుని ప్రముఖుల వరకు లంచ్ బాక్స్ కంపల్సరీ. వారి వారికి తోచిన విధంగా..లంచ్ బాక్స్ లో భోజనం తీసుకొస్తుంటారు. మధ్యాహ్న సమయంలో…లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకుని తింటుంటారు. అయితే…ఓ వ్యక్తి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు. ఇతనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన వారంతా పాపం..అంటున్నారు.

మలేషియాకు చెందిన అపిత్ లిడ్ అనే ఫేస్ బుక్ యూజర్ తన అకౌంట్ లో ఫొటో షేర్ చేశారు. ఫొటోలో సెక్యూర్టీ గార్డు డ్రెస్ ధరించిన వ్యక్తి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడి బాక్స్ ఓపెన్ చేయగా…అందరూ షాక్ తిన్నారు. నీటిలో కలిపిన అన్నం, ఓ ఉల్లిపాయ, మూడు వెల్లిపాయలు మాత్రమే ఉన్నాయి. కూర, పెరుగు ఇతర పదార్థాలు ఏమీ లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని..ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ నంజుకుని తింటాడు. ఈ ఫొటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు అపిత్ లిడ్.

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని, చాలా కష్టపడి పనిచేస్తాడని వెల్లడించారు. కుటుంబానికి దూరంగా..వేరే ప్రదేశంలో పనిచేస్తాడని, తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికి పంపిస్తాడన్నారు. తక్కువ మొత్తం తన కోసం ఉంచుకుని..అలా మిగుల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడని తెలిపారు. ప్రతి రోజు ఇదే అతడి ఆహారం..దీనిని గురించి అస్సలు అతడు బాధ పడడన్నారు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడని చెప్పుకొచ్చారు. ఇతడి పరిస్థితి చూస్తే..చాలా బాధగా ఉంది..అనారోగ్యానికి పాలవుతావు..అంటూ..నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Read More : gold nose pin : కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే..ముక్కు పుల్ల ఫ్రీ