Lion Fish : బాబోయ్.. ఈ చేప చాలా డేంజర్.. విషం చిమ్మి మనిషిని చంపేస్తుంది!

సాధారణంగా సముద్రంలో జీవించే జీవుల్లో చాలావరకు ప్రాణాంతకమైనవి, విషపూరితమైనవే ఉంటాయి. ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తమలోని విషాన్ని చిమ్మి ప్రాణాలను రక్షించుకుంటాయి.

Lion Fish : బాబోయ్.. ఈ చేప చాలా డేంజర్.. విషం చిమ్మి మనిషిని చంపేస్తుంది!

Man Catches Deadly 'lionfish' That Can Paralyse

Deadly lionfish : సాధారణంగా సముద్రంలో జీవించే జీవుల్లో చాలావరకు ప్రాణాంతకమైనవి, విషపూరితమైనవే ఉంటాయి. ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తమలోని విషాన్ని చిమ్మి ప్రాణాలను రక్షించుకుంటాయి. ఈ చేపలు చూడటానికి ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తుంటాయి. కానీ, వాటి సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. విషాన్ని చిమ్మి ప్రాణాలు తీస్తాయి. మనుషులను సైతం చంపేయగలవు. అంత డేంజరస్.. ఇప్పుడు ఓ విష జాతికి చెందిన చేపను యూకేలో గుర్తించారు. అదే.. లయన్ ఫిష్ (LionFish). యూకేలో ఈ జాతికి చెందిన చేపను పట్టుకోవడం ఇదే మొదటిసారి.
Karnataka : విషాదం.. ఇల్లు కూలి ఏడుగురు మృతి

ఈ చేప విషం మనిషి శరీరానికి తగిలితే అంతే.. వెంటనే చచ్చుబడిపోతుంది. కాళ్లు, చేతులు పనిచేయవు.. పక్షవాతం వస్తుందట.. ఆరు అంగుళాల పొడవు మాత్రమే ఉండే ఈ విషపు చేప చెసిల్ బీచ్ లో ఒక వ్యక్తి గుర్తించాడు. దీన్ని లయన్ ఫిష్ అని పిలుస్తారు. అలాగే టెరోయిస్ అనే పేరుతో పిలిచే ఈ చేప ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందినది. ఈ డేంజరస్ చేపలకు అనేక రకాల పేర్లతో పిలుస్తారు. జెబ్రా ఫిష్, ఫైర్ ఫిష్, టర్కీ ఫిష్, బటర్ ఫ్లై కాడ్ లాంటి పేర్లతో పిలుస్తారు. ఈ చేపకు బ్లాక్ బ్యాండ్స్, పెక్టోరల్ ఫిన్స్, స్పైకీ ఫిన్‌రేస్‌ను మనుషులు ముట్టుకుంటే వెంటనే పక్షవాతం వచ్చేస్తుంది.

అంతేకాదు.. తాకిన చోట శరీమంతా తీవ్రంగా నొప్పి కలుగుతుంది. ఎర్రగా వాచిపోయి క్రమంగా పెరాలిసిస్ కు దారితీస్తుంది. విష ప్రభావం ఎక్కువగా ఉంటే.. మరణం కూడా సంభవించే ముప్పు లేకపోలేదు. అరుదైన జాతికి చెందిన చేపగా గుర్తించినట్టు ఫిషింగ్ చేసిన వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ చేపను గుర్తించిన వెంటనే అతడు అక్కడి బయాలజిస్టులకు తెలియజేశాడు. అదృష్టవశాత్తు విషపు చేప అతడిపై దాడి చేయకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపాడు.
WHO Warning : ముప్పు ఇంకా తొలగలేదు, కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక