WHO Warning : ముప్పు ఇంకా తొలగలేదు, కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మ

WHO Warning : ముప్పు ఇంకా తొలగలేదు, కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

Who Warning

WHO Warning : కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మధ్యలోనే ఉన్నామని హెచ్చరించింది. కొందరు కొవిడ్ ముగిసిపోయిందని తిరుగుతున్నారని, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదంది.

గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని వివరించింది. కరోనా కష్టకాలం మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది దానికి బలయ్యారంది. ”కొన్ని చోట్ల ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిందని నటిస్తూ, తిరుగుతున్నారని ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంది.

SBI Gold డిపాజిట్ స్కీమ్ ఏంటి? ఎన్ని రకాలు, అర్హతలేంటి?

వ్యాక్సిన్ తీసుకోనివారే ఎక్కువగా చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ విభాగం చీఫ్ మారియా వన్ కెర్ఖోవ్ అన్నారు. కోవిడ్-19పై ట్విట్టర్‌లో లైవ్ నిర్వహించిన కెర్ఖోవ్.. ‘పరిస్థితి ఇప్పటికీ చాలా ఆందోళనకరంగా ఉంది.. ఎందుకంటే ఈ వైరస్ మీద ఇంకా నియంత్రణ సాధించలేదు. మనం ఇంకా ముప్పు నుంచి బయటపడలేదు.. ప్రస్తుతం మహమ్మారికి చాలా మధ్యలో ఉన్నాం. కానీ అది ఎక్కడ అనేది ఇంకా కచ్చితంగా తెలియలేదు.. ఎందుకంటే ముగింపునకు దగ్గరగా ఉండటానికి మన దగ్గరున్న సాధనాలను ఉపయోగించడం లేదు’ అని తెలిపారు.

‘నేను నిజంగా చెబుతున్నా.. కొన్ని నగరాల్లో ఐసీయూలు, హాస్పిటల్స్ నిండిపోయి ప్రాణాల కోసం పోరాడుతున్నారు.. ప్రజలు పెద్ద సంఖ్యలో మృతి చెందారు.. ప్రజలు పూర్తిగా మహమ్మారి ముగిసినట్లుగా వీధుల్లో తిరుగుతున్నారు. రెండు విధాలుగా ఉండలేరు.. ఎందుకంటే ప్రపంచ సంక్షోభానికి కారణమైన కోవిడ్ -19 నిర్మూలించ లేదు.. ఇంకా అలాగే ఉంది’ అని అన్నారు. టీకా తీసుకోని వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.

South Central Railway : దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్‌ల భర్తీ

కోవిడ్-19పై తప్పుడు సమాచారాన్ని ఇంటర్నెట్ లో ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. వచ్చే మూడు నుంచి 18 నెలల్లో మహమ్మారి తీరు గురించి డబ్ల్యూహెచ్ఓ చర్చలు జరుపుతోందన్నారు.