Video Games: అదేపనిగా మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకు.. తండ్రి వేసిన శిక్షేంటో తెలుసా?

వీడియో గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హెచ్చరించినా కొందరు మారడం లేదు. అలా మాట వినకుండా గేమ్స్ ఆడుతున్న తన కొడుకుకు ఒక తండ్రి గుణపాఠం చెప్పాడు. తండ్రి చేసిన పనితో ఆ కొడుకు.. మళ్లీ వీడియో గేమ్స్ ఆడనంటూ మాటిచ్చాడు.

Video Games: అదేపనిగా మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకు.. తండ్రి వేసిన శిక్షేంటో తెలుసా?

Video Games: మొబైల్ గేమ్స్, వీడియో గేమ్స్‌కు నేటి తరం యువత, పిల్లలు బాగా అడిక్ట్ అయ్యారు. ఖాళీ టైమ్ దొరికిందంటే చాలు.. గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. రాత్రి, పగలూ అనే తేడా లేకుండా నిరంతరాయంగా ఆడుతూనే ఉంటున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హెచ్చరించినా కొందరు మారడం లేదు.

Samyukt Kisan Morcha: రైతుల రుణాలు మాఫీ చేయాలి.. రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి: సంయుక్త కిసాన్ మోర్చా

అలా మాట వినకుండా గేమ్స్ ఆడుతున్న తన కొడుకుకు ఒక తండ్రి గుణపాఠం చెప్పాడు. తండ్రి చేసిన పనితో ఆ కొడుకు.. మళ్లీ వీడియో గేమ్స్ ఆడనంటూ మాటిచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చైనాలోని షెంజెన్ ప్రావిన్స్‌కు చెందిన ఒక పదకొండేళ్ల బాలుడు తరచూ మొబైల్ గేమ్స్ ఆడేవాడు. ఇటీవల అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కూడా అతడు మొబైల్ గేమ్ ఆడటం తండ్రి చూశాడు. రాత్రిపూట మొబైల్ గేమ్ ఆడొద్దని గతంలో చాలాసార్లు చెప్పినప్పటికీ బాలుడు మారలేదు. దీంతో కోపం తెచ్చుకున్న తండ్రి తన కొడుక్కు ఒక శిక్ష విధించాడు. 17 గంటలపాటు నిద్ర పోకుండా, నాన్ స్టాప్‌గా మొబైల్ గేమ్ ఆడాలని ఆదేశించాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు గేమ్ ఆడాలని చెప్పాడు.

RRR Team : రాజమౌళి, RRR టీం ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి 20 లక్షలు చెల్లించారా?

దీంతో తండ్రి చెప్పినట్లు ఆ బాలుడు మొబైల్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడి వల్ల కాలేదు. గంటల తరబడి గేమ్స్ ఆడుతూ చివరకు వాంతులు చేసుకున్నాడు. గేమ్ ఆడలేక బాలుడు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. తర్వాత తన తండ్రికి మాటిచ్చాడు. నిద్ర పోయే ముందు గేమ్స్ ఆడనని, 11 గంటలలోపే నిద్ర పోతానని మాటిచ్చాడు. అప్పుడే ఆ తండ్రి బాలుడిని క్షమించాడు. ఈ తతంగాన్ని అంతా ఆ తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గంటల తరబడి గేమ్స్ ఆడుతున్న తన కొడుకును అలా మార్చుకున్నానని, అయితే, అందరూ తనలాగే చేయాలని చెప్పడం లేదన్నాడు.