Stock market: స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని స్టీల్ తయారీలో దూకేసిన వ్యక్తి

Stock market:  స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని స్టీల్ తయారీలో దూకేసిన వ్యక్తి

Stock market: చైనాలోని స్టీల్ ఫ్యాక్టరీ వర్కర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. 33ఏళ్ల వయస్సున్న వాంగ్ లాంగ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీలో పదేళ్లుగా పనిచేస్తున్నాడు. మార్చి 24న నైట్ షిఫ్ట్ చేసేందుకు డ్యూటీకి వచ్చి కనిపించకుండాపోయాడు.

అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో జరిగిందంతా రికార్డ్ అయింది. అతను దూకే ముందు హెల్మెట్, గ్లౌజులు అన్నింటినీ అత్యధిక ఉష్ణోగ్రతతో మండుతున్న కొలిమిలోకి విసిరేశాడు. దాదాపు 1500డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న దానిలోకి అతను కూడా దూకేశాడు.

అనుకోకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. అతని ట్రేడింగ్ వ్యాపారం కారణంగానే ప్రాణం తీసుకున్నట్లు చెబుతున్నారు. చనిపోయిన రోజే వాంగ్ రూ.6లక్షల వరకూ మార్కెట్లో నష్టపోయాడు. అందుకే అతని మరణానికి స్టాక్ మార్కెట్ కు ఏదో సంబంధముందని అంటున్నారు.

అతను తీవ్రమైన అప్పుల్లో మునిగిపోయానని తిరిగి తీర్చలేనివిగా భావించి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. చైనాలోని చాలా మంది స్టాక్ మార్కెట్స్ ను క్యాజినోలా భావిస్తారు. ఉన్నట్లుండి ధనవంతులమైపోవాలని ప్లాన్ చేసుకుంటూంటారు. కొన్నిసార్లు ఇలా భారీ నష్టాులు కూడా చవిచూడకతప్పదు.

చైనా వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి త్వరగానే కోలుకున్నారు. స్టాక్ మార్కెట్ కూడా 2020లో మంచి ఊపు మీద ఉంది. కాకపోతే ఇటీవలి వారాల్లో బాగా పతనం చెందుతూ వస్తుంది. చైనా, వెస్టరన్ దేశాల మధ్య రాజకీయ సంబంధాలే దీనికి కారణమని చెప్తున్నారు.