Loyal Employee: 70 ఏళ్లుగా ఒకే సంస్థలో ఉద్యోగం

ఎక్కువ జీతం వస్తుందంటే నెలకో సంస్థలో ఉద్యోగం మారిపోతున్నారు నేటి తరంలో, అలాంటిది ఓ వ్యక్తి 70 ఏళ్లుగా ఓకే సంస్థలో పనిచేస్తున్నాడు అది కూడా ఒక్క అనారోగ్య సెలవు కూడా పెట్టకుండా.

Loyal Employee: 70 ఏళ్లుగా ఒకే సంస్థలో ఉద్యోగం

Employeee

Loyal Employee:ఎక్కువ జీతం వస్తుందంటే నెలకో సంస్థలో ఉద్యోగం మారిపోతున్నారు నేటి తరంలో. అలాంటిది ఓ వ్యక్తి 70 ఏళ్లుగా ఓకే సంస్థలో పనిచేస్తున్నాడు అది కూడా ఒక్క అనారోగ్య సెలవు కూడా పెట్టకుండా. బ్రిటన్ కు చెందిన బ్రియాన్ చోర్లీ అనే 83 ఏళ్ల వృద్ధుడు.. ఇంగ్లాండ్ లోని “క్లార్క్స్ షూస్ ఫ్యాక్టరీ”లో పనిచేస్తున్నాడు. 1953లో అతనికి 15 ఏళ్ల వయసులో మొదటిసారి ఆ చెప్పుల తయారీ సంస్థలో పనిచేయడం ప్రారంభించాడు. మొదట్లో 45 గంటల పని సమయానికి గానూ 2 పౌండ్ల 3 షిల్లింగ్స్ జీతం అందుకున్న బ్రియాన్, అందులో ఒక పౌండ్ ని తన తల్లికి ఇచ్చేవాడు. అనంతరం అదే సంస్థలో పలు విభాగాల్లో పనిచేశాడు బ్రియాన్.

Also read:Tiger Spotted: మెడకు ఉచ్చుతో ప్రాణాపాయ స్థితిలో సంచరిస్తున్న పెద్ద పులి

ఎంతో పేద కుటుంబంలో పుట్టిన బ్రియాన్ చిన్నతనంలో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బ్రియాన్ తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం కుటుంబ పోషణ మరింత భారం అవడంతో బ్రియాన్ పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో 15 ఏళ్ల వయసులో తనకు దొరికిన అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాడు. ఇక క్లార్క్స్ షూ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావడంతో అది విడిచి ఎక్కడికీ పోలేదు బ్రియాన్. గత 70 ఏళ్లుగా అదే సంస్థలో పనిచేస్తున్న బ్రియాన్ ఇప్పటివరకు ఒక్క అనారోగ్య సెలవు(Sick Leave) కూడా తీసుకోలేదని “ఇండియా టైమ్స్” కథనంలో పేర్కొంది.

Also read: Covid In India: వారం రోజులుగా కరోనా విధ్వంసం.. దేశంలో ఈ 15 జిల్లాల్లోనే!

” ఇటీవలే హెల్త్ చెక్అప్ చేయించుకున్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, ఇలా శరీరం సహకరించినంత కాలం పనిచేసుకుంటూ పోతా” అంటూ ఉద్యోగంపై తనకున్న ఇష్టాన్ని చాటిచెబుతున్నాడు బ్రియాన్. ఇక సంస్థలో ప్రస్తుతం కస్టమర్ సర్వీస్ విభాగంలో పనిచేస్తున్న బ్రియాన్..తాను ఎంతో వినయంగా సేవను అధిస్తానంటూ తమ వినియోగదారులు చెబుతుంటారని, అది విన్నపుడు ఎంతో సంతోషం కలుగుతుందని అంటున్నాడు.