Tiger Spotted: మెడకు ఉచ్చుతో ప్రాణాపాయ స్థితిలో సంచరిస్తున్న పెద్ద పులి

మహారాష్ట్ర నాగపూర్ జిల్లా పరిధిలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఒక పెద్దపులి.. మెడకు ఉచ్చుతో ప్రాణాపాయస్థితిలో సంచరిస్తుందంటూ ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.

Tiger Spotted: మెడకు ఉచ్చుతో ప్రాణాపాయ స్థితిలో సంచరిస్తున్న పెద్ద పులి

Tiger

మహారాష్ట్ర నాగపూర్ జిల్లా పరిధిలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఒక పెద్దపులి.. మెడకు ఉచ్చుతో ప్రాణాపాయస్థితిలో సంచరిస్తుందంటూ ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. T41 జాతికి చెందిన ఈ పెద్దపులి.. నాగల్వాడి రేంజ్ పరిధిలోని మైకేపర్ బీట్ ఏరియాలో అటవీశాఖ అమర్చిన కెమెరాకు చిక్కింది. మెడకు ఉచ్చుతో పులి ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు కెమెరా ఫుటేజీ ద్వారా తెలుసుకున్న అధికారులు.. అటవీశాఖ సిబ్బందిని, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కెమెరా అమర్చిన ప్రాంతం స్థానిక వ్యవసాయ క్షేత్రాలకు కేవలం ఒక కిలోమీటరు పరిధిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పులి జాడలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ గ్రామస్తులకు తెలిపారు. పెంచ్ టైగర్ రిజర్వు ప్రాంతానికి పశ్చిమాన ఉంటున్న వనేరా గ్రామ సమీపంలో జనవరి 26, 27 తేదీల్లో పెద్దపులి గాండ్రింపులు వినిపించాయని..ఆ అరుపులు నొప్పితో తాళ్లలేక ఎంతో బాధతో కూడినట్లుగా ఉన్నాయంటూ గ్రామస్తులు పేర్కొన్నారు.

Also read: King Cobra : నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. చేతులతోనే కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి..

పులి మెడకు చుట్టుకున్న ఉచ్చును తొలగించేందుకు 9 అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగాయి. పులి జాడ మొదట కనుగొన్న ప్రాంతం నుంచి ఐదు, పది చదరపు కిలోమీటర్ల పరిధులలో మరికొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పశ్చిమ పెంచ్, సాలెఘాట్ మరియు నాగల్వాడి శ్రేణుల మీదుగా సంచరిస్తున్న పులిని పట్టుకుని, ఉచ్చు తొలగించి దాని ప్రాణాలు కాపాడేందుకు అధికారులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. సమీప గ్రామాల సర్పంచ్ ల సహకారంతో ఒక వాట్సాప్ గ్రూప్ ను రూపొందించిన అటవీశాఖ అధికారులు.. పులి జాడపై నిరంతర సమాచారాన్ని అందులో ఉంచాలని సూచించారు. పెంచ్ అటవీశాఖ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలు, అడవి సరిహద్దుల్లో ఉచ్చులు ఇంకా ఏమైనా ఉండిఉంటాయన్న సమాచారంతో వాటిని తొలగించేందుకు అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు.

Also Read: Tirumala Fake Tickets : తిరుమలలో నకిలీ దర్శనం టికెట్లతో ఘరానా మోసం.. ఇద్దరిపై కేసు

పులి మెడకు ఉచ్చు బిగుసుకు పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పులి దానంతట అదే ఉచ్చులో చిక్కుకుందా లేక వేటగాళ్ళు ఎవరైనా పులిని పట్టుకునేందుకు ప్రయత్నించి ఉంటారా అనేకోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలాఉంటే..వన్యప్రాణులను ఉచ్చుల భారీ నుంచి కాపాడేందుకు పెంచ్ టైగర్ రిజర్వు ప్రాంతానికి 100 మంది ప్రత్యేకమైన సిబ్బంది ఉన్నారు. స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (STPF)గా పిలిచే వీరికి.. అడవుల్లో దాగిఉన్న ఉచ్చులను తొలగించడమే పని. అయితే గత ఏడు నెలలుగా STPF సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో వారు విధుల్లోకి రావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: Gujarat Covid : గుజరాత్‌లో కొత్తగా 12,131 కరోనా కేసులు, 30 మరణాలు