King Cobra : నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. చేతులతోనే కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి.. | Watch Thailand Man Catches Massive King Cobra With Bare Hands

King Cobra : నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. చేతులతోనే కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి..

కళ్ల ముందే భారీ సైజులో విషపూరితమైన కింగ్ కోబ్రా ఉన్నా.. అస్సలు భయపడలేదు. అంతేనా.. ఒట్టి చేతులతోనే కాలనాగుని పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

King Cobra : నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. చేతులతోనే కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి..

King Cobra : సాధారణంగా చిన్న పాము కనిపిస్తేనే మనకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. వెన్నులో వణుకు పుడుతుంది. గుండెలో రైళ్లు పరిగెడతాయి. పాముని చూడగానే ప్రాణ భయంతో పరుగులు తీస్తాము. ఇక అవి చేసే భయంకరమైన చప్పుడు, వాటి ఆకారం కూడా వెన్నులో భయం పుట్టిస్తాయి.

అలాంటిది.. ఏకంగా అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కళ్ల ముందు కనిపిస్తే.. వామ్మో.. ఇంకేమైనా ఉందా? ప్రాణాలు పోయినంత పనవుతుంది అంటారా? మన సంగతి అటుంచితే.. ఆ వ్యక్తి మాత్రం మనలా కాదు. కళ్ల ముందే భారీ సైజులో కింగ్ కోబ్రా ఉన్నా.. అస్సలు భయపడలేదు. అది చాలా ప్రమాదకరం, అత్యంత విషపూరితమైనదని తెలిసినా వెనకడుగు వేయలేదు. ఒట్టి చేతులతోనే కాలనాగుని పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

థాయ్ లాండ్ లో ఈ ఘటన జరిగింది. అతడు పాములు పట్టే వాలంటీర్. స్థానిక క్రాబీ ప్రావిన్స్ ప్రాంతంలో పేద్ద పాము కనిపించింది. అది కింగ్ కోబ్రా. భారీ ఆకారంలో బుసలు కొడుతున్న దాన్ని చూసి స్థానికులు హడలిపోయారు. వెంటనే పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన సిబ్బంది అక్కడికి చేరుకుంది. ఆ వ్యక్తి పేరు సూ నౌహాడ్(40). కళ్ల ముందే కింగ్ కోబ్రా ఉన్నా అతడు అస్సలు భయపడలేదు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఒట్టి చేతులతో కింగ్ కోబ్రాను పట్టాకున్నాడు. ఎంతో నేర్పుగా దాన్ని బంధించాడు. 20 నిమిషాల ప్రయత్నం తర్వాత అతడు దాన్ని పట్టుకోగలిగాడు. దీన్ని స్థానికులు వీడియో తీశారు. సూ నౌహాడ్ ముందుగా పొదల్లో నక్కిన పాముని రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత దాన్ని పట్టుకున్నాడు.

ఆ పాము ఏకంగా 4.5 మీటర్ల(14 ఫీట్) పొడవు ఉంది. దాని బరువు 10 కిలోలు. అంత పెద్ద పాముని ఎంతో తెలివిగా, అస్సలు భయపడకుండా ఒట్టి చేతులతో పట్టేసిన ఆ వ్యక్తిని అంతా ప్రశంసిస్తున్నారు. నీ గట్స్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు అని కితాబిస్తున్నారు.

పాము అతడి చేతికి అంత ఈజీగా చిక్కలేదు. 20 నిమిషాలు తిప్పలు పెట్టింది. ఒకానొక సమయంలో కాటేయబోయింది. తెలివిగా తప్పించుకున్న సూ.. చివరికి పాముని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి అడవుల్లో వదిలేశాడు. పాము బుసలు కొడుతున్నా, కాటేేసేందుకు మీదకు వస్తున్నా అతడు అస్సలు భయపడలేదు. ఎంతో ధైర్యంగా అక్కడే ఉన్నాడు. ఎంతో తెలివిగా, నేర్పుగా పాముని పట్టేశాడు.

అయితే, తన లాగా పాముని పట్టుకునేందుకు ఎవరూ ప్రయత్నం చేయొద్దని సూ కోరాడు. అది చాలా ప్రమాదకరం అన్నాడు. ఏ మాత్రం తేడా వచ్చినా పాము చేతిలో చావు ఖాయం అని హెచ్చరించాడు. తాను ఎన్నో ఏళ్లు పాములు పట్టడంలో శిక్షణ తీసుకున్నానని, ఆ విధంగా నైపుణ్యం సాధించానని వివరించాడు.

Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్న మాటే..

కాగా, కింగ్ కోబ్రా చాలా డేంజరస్ పాము. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాము జాతి. ఈ జాతి పాములు బాగా పొడవుగా ఉంటాయి. ఇది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. సగటు పొడవు 10 నుండి 13 అడుగుల వరకు ఉంటుంది. రికార్డు స్థాయిలో అతి పెద్ద కింగ్ కోబ్రాలలో ఒకటి (18 అడుగుల మరియు 4 అంగుళాలు) థాయ్‌లాండ్‌లో బంధించబడింది.

×