Tirumala Fake Tickets : తిరుమలలో నకిలీ దర్శనం టికెట్లతో ఘరానా మోసం.. ఇద్దరిపై కేసు

తిరుమలలో మరోసారి నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి.. నకిలీ టికెట్లు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు..

Tirumala Fake Tickets : తిరుమలలో నకిలీ దర్శనం టికెట్లతో ఘరానా మోసం.. ఇద్దరిపై కేసు

Tirumala Fake Tickets

Tirumala Fake Tickets : తిరుమలలో మరోసారి నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి.. నకిలీ టికెట్లు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఇద్దరిపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడు ఆటో డ్రైవర్ ఉన్నాడు. టీటీడీ విజిలెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.

Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్న మాటే..

తిరుపతికి చెందిన ఆటో డ్రైవర్ మౌన్ కుమార్, సౌందర్ లు పాండిచ్చేరికి చెందిన సుబ్రమణియన్ అనే భక్తుడికి రూ.8వేలకు 3 నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విక్రయించారు. ఆ నకిలీ టికెట్లతో దర్శనానికి వెళ్లడానికి అతడు ప్రయత్నించాడు. అయితే రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో నకిలీ టికెట్లు పసిగట్టిన విజిలెన్స్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన అధికారులు ఆ భక్తుడిని విచారించారు. ఆ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో వివరాలు అడిగారు. దీంతో ఆ భక్తుడు జరిగింది చెప్పాడు. తిరుప‌తిలో ఆటో డ్రైవర్ మౌన్ కుమార్, సౌంద‌ర్ పేర్లు బయటపెట్టాడు. తనతో రూ.8 వేలు తీసుకుని టికెట్లు ఇచ్చాడని తెలిపాడు. ఈ టికెట్లతో దర్శనానికి వెళ్లగా.. న‌కిలీ టికెట్లుగా తేల‌డంతో మోస‌పోయామ‌ని గుర్తించామ‌న్నాడు. వెంటనే అలర్ట్ అయిన విజిలెన్స్ అధికారులు నకిలీ దర్శనం టికెట్లు విక్రయించిన ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

కాగా.. భక్తులను మోసం చేసే డ్రైవర్ల.. డ్రైవింగ్ లైసెన్స్ లను సీజ్ చేస్తామని టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. అలాగే… భక్తులను కూడా అప్రమత్తం చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. దర్శనం టికెట్ల పేరుతో ఎవరైనా సంప్రదిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.