టై కట్టుకోలేదని ఎంపీని సస్సెండ్ చేసిన స్పీకర్

టై కట్టుకోలేదని ఎంపీని సస్సెండ్ చేసిన స్పీకర్

Maori MP ejected from NZ parliament : టై కట్టుకోలేదని ఓ ఎంపీని సస్పెండ్ చేశారు స్పీకర్. పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆ ఎంపీని స్పీకర్ ఆదేశించారు. దీంతో చేసేది ఏమీ లేక..బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన భారతదేశంలో జరిగింది కాదు. పార్లమెంట్ సమావేశాల్లో..సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తిట్టిపోసుకోవడం వంటివి చూస్తుంటాం. అంతేగాకుండా..పోడియం వద్దకు వెళ్లి..బైఠాయించడం, స్పీకర్ పై పేపర్లు విసరడం లాంటివి జరుగుతుంటాయి.

న్యూజిలాండ్ పార్లమెంట్  Trevor Mallard… అనే వ్యక్తి Maori Partyకి చెందిన సభ్యుడు. ఓ అంశంపై సభలో చర్చ జరుగుతోంది. రివైరి ఓ ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. కానీ..స్పీకర్ నిరాకరించారు. ఇలా రెండు సార్లు అడిగేందుకు యత్నించారు. మీకు సభలో మాట్లాడే హక్కు లేదని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా టై కట్టుకోకుండా వచ్చారంటూ..సభలో వెల్లడించారు. సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో సభలో ఒక్కసారిగా సైలెంట్ వాతావరణం ఏర్పడింది. స్పీకర్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలి కాబట్టి…సదరు ఎంపీ సభ నుంచి బయటకు వచ్చేశారు. న్యూజిలాండ్ పార్లమెంట్ లో చర్చలో పాల్గొనే వారు..తప్పనిసరిగా..టై ధరించాలనే నిబంధన ఉంది.