కోవిడ్‌ను మాస్క్‌లు, సామాజికదూరం గట్టిగా అడ్డుకొంటున్నాయి. కొత్త అధ్యయనం ఇదే చెప్పింది

  • Published By: srihari ,Published On : June 2, 2020 / 11:08 AM IST
కోవిడ్‌ను మాస్క్‌లు, సామాజికదూరం గట్టిగా అడ్డుకొంటున్నాయి. కొత్త అధ్యయనం ఇదే చెప్పింది

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ప్రధానంగా రెండు ఆయుధాలు అవసరమని ఓ కొత్త అధ్యయనం చెప్పింది. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ లేదు. ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు. అప్పటివరకూ మహమ్మారి ముప్పు నుంచి ప్రపంచం బయటపడాలంటే నివారణ చర్యల తప్ప మరో మార్గం లేదు. అందులో ప్రధానంగా ఉండాల్సిన రెండు ఆయుధాలు.. ఫేస్ మాస్క్, సామాజిక దూరం. కరోనాను కట్టడి చేయడంలో ఈ రెండు కీలకమని కొత్త అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు.. చేతులను శుభ్రంగా కడుక్కోవడం సహా ఇతర నివారణ చర్యలు తప్పక అవసరమని కూడా అధ్యయనంలో పరిశోధకులు స్పష్టం చేశారు. కరోనా నివారణ చర్యల్లో ఫేస్ మాస్క్‌ల పనితీరుపై కూడా రీసెర్చర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సింగిల్ లేయర్ క్లాత్ మాస్క్‌లు.. సర్జికల్ మాస్క్‌ల కంటే తక్కువ రక్షణ ఇస్తాయని తెలిపారు. బిగుతుగా ఉండే N95 మాస్క్‌లే బాగా పనిచేస్తాయని తమ అధ్యయనంలో గుర్తించినట్టు తెలిపారు. ఈ అధ్యయనాన్ని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ లో ప్రచురించారు. 

సామాజిక దూరమంటే.. ఒక మీటర్ (మూడు అడుగుల కంటే) దూరం కంటే తక్కువగా ఉన్నవారిలో వైరస్ సోకే ప్రమాదం ఉంది. లేదంటే రెండు మీటర్లు (6.5 అడుగులు) కూడా ఎంతో ఉత్తమం. కరోనా వైరస్ నుంచి కళ్లకు కళ్ల అద్దాలు రక్షణగా ఉంటాయి. ఇంతకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా సమర్థవంతంగా పనిచేయవు. దీనిపై మరిన్నో అధ్యయనాలు అవసరమని పరిశోధకులు విశ్లేషించారు. కొత్త కరోనా వైరస్‌తో  ఆరోగ్య అధికారులు severe acute respiratory syndrome (SARS), Middle East respiratory syndrome (MERS)లపై జరిపిన అధ్యయనాలపైనే ఆధారపడ్డారు. ఒక క్రమ పద్ధతిలో జరిగిన 44 అధ్యయనాల నుంచి పరిశోధకులు గుర్తించారు. ఇందులో ఏడు అధ్యయనాలు కొవిడ్-19 వ్యాప్తికి చెందినవే ఉన్నాయి. 

మిగిలిన అధ్యయనాలు SARS లేదా MERS లపైనే ఫోకస్ పెట్టాయి. పాలసీ మేకర్లు వినియోగం కోసం ఈ మొత్తం సమాచారాన్ని ఒకేచోట పెట్టినట్టు McMaster University in Hamilton, Ontario, Canadaలోని అధ్యయన సహ రచయిత డాక్టర్ Derek Chu అభిప్రాయపడ్డారు. మాస్క్‌లు ఎంతవరకు సురక్షితం అనేదానిపై ఎంపిక చేసిన కొంతమంది నర్సుల బృందాలతో పాటు సాధారణ ప్రజలు ధరించిన మాస్క్ లను కెనడా, డెన్మార్క్ టెస్టింగ్ చేస్తోంది. దీనిపై ఫలితాలు రావాలంటే మరెన్నో ప్రయోగాలు చేయాల్సి ఉంది. లాన్సెట్ అధ్యయనంలో చెప్పినట్టుగా మాస్క్‌లు ఎంతో మేలు చేస్తాయని గుర్తించాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త విశ్లేషణ ప్రకారం.. ఆరోగ్యకరమైన వారు కొవిడ్-19 సోకిన వ్యక్తి నుంచి రక్షణ కోసం మాత్రమే ధరించవచ్చునని పేర్కొంది. అమెరికాలో US Centers for Disease Control Prevention అక్కడివారిని కనీసం క్లాత్ మాస్క్ ధరించాల్సిందిగా సూచిస్తోంది. గ్రాసరీ షాపింగ్ లేదా సామాజిక దూరం కష్టమైన సందర్భాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తోంది. బయటకు వెళ్లే ముందు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నియమాన్ని కొన్ని దేశాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. 

Read: ఎబొలా వైరస్ మళ్లీ వచ్చింది.. లక్షణాలపై తెలియని ఆరు వాస్తవాలు ఇవే