McDonalds : కొలువుల కోత.. ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్‌డొనాల్డ్స్

McDonalds : మెక్ డొనాల్డ్స్ సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగుల్లో కొంతమందికి ఉద్వాసన పలకనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.

McDonalds : కొలువుల కోత.. ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్‌డొనాల్డ్స్

McDonalds

McDonalds : ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. పలు కారణాలతో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, లింక్డిన్, మెటా లాంటి టెక్ దిగ్గజాలు ఒకదాని తర్వాత ఒకటి సంస్థల్లోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీల్లో తనకంటూ గుర్తింపు పొందిన దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్స్డ్.. తాజాగా తమ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెక్ డొనాల్డ్స్ సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగుల్లో కొంతమందికి ఉద్వాసన పలకనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఉద్యోగుల తొలగింపులో భాగంగానే అమెరికాలోని పలు కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా తెలిపింది. బుధవారం వరకు ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గతవారం తన యూఎస్ ఉద్యోగులకు మెయిల్ పంపినట్లుగా వాల్ స్ట్రీట్ పేర్కొంది.

Also Read..E-Scooters Ban: సెప్టెంబర్ 1 నుంచి పారిస్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల నిషేధం.. ఎందుకంటే..

ఉద్యోగుల తొలగింపు కోసమే మెక్ డొనాల్డ్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, మెక్ డొనాల్డ్స్ ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది అనే దానిపై స్పష్టత లేదు. ఏప్రిల్ 3వ వారంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తెలియజేస్తామని మెక్ డొనాల్డ్స్ మెయిల్ లో స్పష్టం చేసింది. ఈ వారంలో షెడ్యూల్ చేయబడిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా ఉద్యోగులను కోరింది. అయితే, బుధవారం నాటికి ఉద్యోగుల తొలగింపు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read..Twitter Logo Changed: పిట్ట పోయింది డాగ్‍‌‌ వచ్చింది..! ట్విటర్‌లో కనిపించని బ్లూ బర్డ్.. అయోమయంలో నెటిజన్లు..

ఆర్ధిక మాంద్యం.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, సంస్థలు కాస్ట్ కటింగ్ పై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీ కోత వేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే చాలా రంగాల్లో ఈ పరిస్థితి ఉంది. ఖర్చు తగ్గించుకునే పేరుతో ఆఫీసులు మూసివేస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.

ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, మెటా, అమెజాన్ తదితర దిగ్గజ కంపెనీలు.. వేలాది మంది ఉద్యోగులను తొలగించేశాయి. ఇక, ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా సైతం ఇప్పుడు తీవ్ర సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాలో పేరొందిన రెండు బ్యాంకులు దివాళా తీశాయి. దీంతో వాటిని మూసివేశారు.