Twitter Logo Changed: పిట్ట పోయింది డాగ్‍‌‌ వచ్చింది..! ట్విటర్‌లో కనిపించని బ్లూ బర్డ్.. అయోమయంలో నెటిజన్లు..

ట్విటర్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ట్విటర్ లోగోను సీఈఓ ఎలాన్ మస్క్ మార్చేశాడు. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ కాయిన్‌ను చేర్చాడు. దీంతో యూజర్లు తొలుత ట్విటర్ హ్యాక్ అయిందని అనుకున్నప్పటికీ.. మస్క్ ట్వీట్ తరువాత లోగో మార్పుపై క్లారిటీ వచ్చేసింది.

Twitter Logo Changed: పిట్ట పోయింది డాగ్‍‌‌ వచ్చింది..! ట్విటర్‌లో కనిపించని బ్లూ బర్డ్.. అయోమయంలో నెటిజన్లు..

Elon Musk with twitter new logo

Twitter Logo Changed: ట్విటర్‌ (Twitter) లో కీలక మార్పు చోటు చేసుకుంది. ట్విటర్‌లో నిత్యం యూజర్లకు కనిపించే బ్లూ బర్డ్ (Blue bird) ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. దాని స్థానంలో సోమవారం సాయంత్రం నుంచి డాగీ (Doge) వచ్చేసింది. దీనిని చూసిన యూజర్లు ఆశ్చర్యపోయారు. ట్విటర్ లోగో (Twitter Logo) లో అందరూ కుక్కను చూస్తున్నారా అని ఒకరినొకరు ట్వీట్లు చేసుకోవటం ప్రారంభించారు. దీంతో కొద్దిసేపటికే #DOGE ట్విటర్‌లో ట్రెండింగ్‌ను ప్రారంభించింది. అయితే, కొందరు యూజర్లు ట్విటర్ హ్యాక్ అయిందని భావించారు. ఆ తరువాత ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడంతో ట్విటర్ లోగోను మార్చినట్లు స్పష్టమైంది.

Twitter Blue Verified Tick : ట్విట్టర్ బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించేది లేదు.. తెగేసి చెప్పిన టాప్ కంపెనీలు, ప్రముఖులు.. ఎందుకో తెలుసా?

 

 

ట్విటర్ లోగో మారడంతో యూజర్లు అయోమయానికి గురయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి ట్విటర్ లో ఏం జరుగుతుందోననే అయోమయాన్ని యూజర్లు వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి 12.20 గంటల సమయంలో మస్క్ ఓ ట్వీట్ చేశాడు. అందులో కారు డ్రైవింగ్ సీటుపై కుక్క కూర్చొని తన లైసెన్స్‌ని ట్రాఫిక్ పోలీసులకు అందిస్తుంది. అందులో బ్లూ బర్డ్ లోగో (పాత లోగో) ఉంది. ఇంతలోనే డాగీ మాట్లాడుతూ.. ఇది పాత ఫొటో అని పోలీసులకు సూచిస్తున్నట్లు ఉన్న కార్ట్యూన్ ను మస్క్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో  యూజర్లకు మస్క్ ట్విటర్ లోగోను మార్చేశాడని అర్థమైంది.

 

 

 

ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. గతంలో కూడా డాగీ గురించి ప్రస్తావించాడు. అయితే, అప్పుడు ఎవరికి అర్థంకాలేదు.. ట్విటర్ లోగోను మస్క్ మార్చబోతున్నాడని. లోగోను మార్చిన తరువాత మస్క్ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో మార్చి 26న మస్క్ చాట్ చేసిన స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశాడు. ఈ స్క్రీన్ షాట్ లో చేసిన పోస్ట్ లో మస్క్ కొత్త ప్లాట్ పారమ్ అవసరమా అని అడిగారు. దీనిపై చైర్మన్ అనే వినియోగదారుడు ట్వీట్ చేస్తూ.. ట్విటర్ ని కొనుగోలు చేయండి, దాని బ్లూ బర్డ్ లోగోను డాగీతో భర్తీ చేయండి అని ఉంది. ఇదిలాఉంటే, ట్విటర్ డాగీ కాయిన్ లోగో కేవలం డెస్క్ టాప్‌లోనే కనిపిస్తోంది. మొబైల్ యాప్‌లో ఎలాంటి మార్పు లేదు. ఎప్పటిలాగానే బ్లూ బర్డ్ లోగో వస్తుంది.