Meta Employee : రూ.3 కోట్లు జీతం వచ్చే ఉద్యోగానికి రిజైన్ చేసిన యువ ఇంజనీర్ .. ఎందుకంటే

మూడు కోట్ల రూపాయలు జీతం అందుకునే ఓ ఉద్యోగి రిజైన్ చేశాడు. మెటాలో పనిచేసే ఓ ఇంజనీర్ భారీ జీతాన్ని వద్దనుకుని ఓ సాధారణ ఉద్యోగంలో చేరాడు.ఎందుకంటే..

Meta Employee : రూ.3 కోట్లు జీతం వచ్చే ఉద్యోగానికి రిజైన్ చేసిన యువ ఇంజనీర్ .. ఎందుకంటే

Meta Employee Resign

Meta Employee Resign : నీకేంటిరా రూ.లక్షల్లో జీతం వస్తుంది..ఏం బాధలుంటాయి ..? మేమెన్ని కష్టాలు పడుతున్నామో తెలుసా..? అంటూ చిరుద్యోగులు తెగ బాధపడిపోతుంటారు. మరి రూ.లక్షల్లోనే జీతం వచ్చేవారికే బాధలు లేవంటే ఇక రూ.కోట్లల్లో జీతాలు వచ్చేవారికి అసలు బాధలంటే ఏంటో తెలియదా..? బాధలు ఇబ్బందులు అనేవి కేవలం చిరుద్యోగులకేనా.. భారీగా జీతాలు అందుకునేవారికి ఉండవా..? అంటే ఎందుకుండవు..? కచ్చితంగా ఉండి తీరుతాయి. ఏ రంగంలో అయినా జీతం చిన్నదా పెద్దదా..? అనే తేడా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగమా..? కార్పొరేట్ ఉద్యోగమా.. అనే తేడా ఉండదు..ఎక్కడ ఉండే ఇబ్బందులు, ఎక్కడ ఉండే ఒత్తిడులు అక్కడే ఉంటాయి.

అటువంటిదే జరిగింది మూడు కోట్ల రూపాయలు జీతం అందుకునే ఓ ఉద్యోగి విషయంలో.. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాలో పనిచేసే ఓ ఉద్యోగి రూ.3 కోట్ల జీతం వచ్చే ఉద్యోగానికి రిజైన్ చేసిపారేశాడు. జీతం భారీగానే ఉంది కానీ ఆ ఉద్యోగతం తనకు సరిపడదని నిర్ణయించుకుని రిజైన్ చేసి బయటపడ్డాడు. మెటాలో పని చేస్తోన్న 28 ఏళ్ల టెకీ పేరు ఎరియ్ యు. అతను మెటాలో పనిచేస్తున్న సమయంలో పానిక్ అటాక్స్ వచ్చే పరిస్థితికి చేరుకున్నాడు. దీనికి కారణం పని ఒత్తిడి..పని గంటలు దాటినా ఆ ఒత్తిడి నుంచి బయటపడలేకపోవటంతో ఏకంగా ఏడాదికి రూ.3 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని  వదిలేసుకోవటానికి కూడా వెనుకాడలేదు. వర్క్ టైమ్ కంప్లీట్ అయిన తరువాత కూడా ఆ ఒత్తిడి నుంచి బయటపడలేకపోయేవాడట ఎరియ్ యు.

Ring of Fire : నేడే ఆకాశంలో అద్భుతం .. ఉంగరం ఆకృతిలో కనువిందు చేయనున్న సూర్యుడు..!

దీంతో పని సమయంలోను..వర్క్ టైమ్ ముగిసిన తరువాత కూడా పానిక్ అయిపోయేవాడు. వర్క్ నుంచి డిస్‌కనెక్ట్ కాలేకపోవడం వల్ల ఉద్యోగం మానేసానని చెప్పుకొచ్చాడు ఎరిక్. కోవిడ్ సమయంలో మూడేళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని.. మొదటిసారిగా తాను పానిక్ అవ్వటం అప్పుడు మొదలైందని తెలిపాడు. ఉదయం 7 గంట‌ల‌ నుంచి సాయంత్రం 5 గంట‌ల‌ వరకు వర్క్ లో కంటిన్యూగా ఉండేదని ఆ తర్వాత కూడా ప‌ని నుంచి డిస్‌క‌నెక్ట్ కాలేక‌పోయానని అదే పని ఒత్తిడి వెంటాడి పానిక్ ఎటాక్ కు గురయ్యేవాడినని వెల్లడించాడు.

అంత కష్టపడి పనిచేసినా ఏమాత్రం గుర్తింపు లేదని వీకెండ్స్ లో బాస్ లు తన పనిని పదే పదే విమర్శించేవారు అంటూ వాపోయాడు. దీంతో తాను ఆఫీసులో కూడా పానిక్ అయిపోయేవాడినని ఇలా చాలాసార్లు జరిగింది. దీంతో  జీతం రూ.3కోట్లు అయినా ఉద్యోగం వదులుకోవటానికే సిద్ధపడి రిజైన్ చేసేశానని తెలిపారడు. ఇప్పుడు తాను రియ‌ల్ ఎస్టేట్‌లో ప‌ని చేస్తున్నాన‌ని చెప్పాడు.