Red Crabs Viral video : కోట్ల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ఎర్రపీతలు..నానా పాట్లు పడుతున్న ప్రజలు

ఎర్రపీతలు దండుగా వచ్చాయి. కోట్ల సంఖ్యలో ఎర్రపీతలు రోడ్లపైకి వచ్చాయి. ఇళ్లు, పార్కులు,బ్రిడ్జిలు ఎక్కడ చూసిన ఎర్రతివాచీ పరిచినట్లుగా ఎర్రపీతలు ఎగబాకుతున్నాయి.

Red Crabs Viral video : కోట్ల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ఎర్రపీతలు..నానా పాట్లు పడుతున్న ప్రజలు

Red Crabs On Roads,hoses (1)

Millions of crabs on Australia Christmas Island : వందా కాదు..వెయ్యి కాదు లక్షలు కూడా కాదు ఏకంగా కోట్ల సంఖ్యలో ఎర్రపీతలు రోడ్లపైకి దండెత్తి వచ్చాయి.రోడ్లు, బ్రిడ్జ్ లు, ఇళ్లు,పార్కులు ఇలా ఎక్కడ చూసిన ఎర్రటి తివాచీ పరిచినట్లుగా ఎర్రపీతలు పోటెత్తాయి. కోట్ల సంఖ్యలో దండెత్తి వచ్చాయి. ఎర్ర పీతలు ఏకంగా జనజీవనాన్ని స్థంభింపజేశాయి. ఆస్ట్రేలియాలోని క్రిస్‌మ‌స్ ఐలాండ్‌లోనే ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఐలాండ్‌కు వ‌చ్చిన టూరిస్టులు, అక్క‌డి స్థానికులు.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఐలాండ్‌లో తిరుగుతున్న క్రాబ్స్‌ను చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. డోర్లు అన్ని బిగించుకుని జనాలు ఇళ్లల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి తెచ్చాయి ఈ ఎర్రపీతల దండు..

క్రిస్ మస్ ఐలాండ్ లో రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్ల మీదకు పీతలు ఎగ‌బడ్డాయి. ఒక్కసారిగా ఇలా వచ్చిన పీతలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీరికి ఇది సర్వసాధారణమే అయినా ఈ ఏడాది ఎర్రపీతలు భారీ సంఖ్యలో రావటంతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లపై తివాచీ పరిచినట్లుగా పాకుతుంటే వాహనాలు వెళ్లటానికి కూడా ఇబ్బందిగా మారాయి. ఇళ్లను విడిచి బయటకు రావడడానికి భయపడిపోతున్నారు. చివరకు రోడ్లను కూడా క్లోజ్ చేశారు.ఎర్రపీతలు ఇలా ప్రతి ఏడాది పీతలు ఇలా జనావాసాల మధ్యకు వస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇది ఎర్రపీతలకు ప్రకృతి సహజంగా వచ్చిన అలవాటు. అవి ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి? వాటి సంతతిని పరిరక్షించుకోవటానికి ఎక్కడకు వెళ్లాలి? అనే విషయం వాటికి తెలుసు. అది ప్రకృతి సహజంగా వచ్చినదే.

Read more : వందలాది పక్షుల ప్రాణాలు తీసిన న్యూ ఇయర్ వేడుకలు

దాంట్లో భాగంగానే ఎర్రపీతలు క్రిస్‌మ‌స్ ఐలాండ్‌లో సమీపంలోని అడ‌వి నుంచి వెస్ట‌ర్న్ ఆస్ట్రేలియాలో ఉన్న నేష‌న‌ల్ పార్క్ తీరం వైపు కోట్లకొద్దీ ఎర్రపీతలు వెళ్తుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో అడవుల్లో వర్షాలు కురవడం ఆగిన తర్వాత ఇలా ఈ పీతలు సముద్రంలోకి వెళ్తాయి. ఆలా సముద్రంలోకి వెళ్లటానికి అవి రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు దాటుకుని వెళ్తాయి. కానీ ఈ ఏడాది అలా వెళ్లే పీతల సంఖ్య అత్యంత భారీగా ఉండటంతో కాస్త ఇబ్బందులు వచ్చాయి.

ఈ సారి ఇలా రోడ్డుమీదకు దాదాపు 5 కోట్లకుపైగా పీత‌లు వచ్చాయని అంటున్నారు. ఇవి రోడ్లు, పార్కులు, ఇళ్లు, బ్రిడ్జిల‌ను ఆక్రమించాయి. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం రహదారులను మూసివేసింది. ఇవి సముద్రంవైపు ప్రయాణించే సమయంలో దారిలో దొరికేవన్నీ తినేస్తున్నాయి. పూలు, పండ్లు, గింజలు, ఆకులు. చిన్న చిన్న క్రిములు, పురుగులు ఇలా ఏది దొరికితే వాటిని తింటూ పోతుంటాయి. కోట్ల సంఖ్యలో రోడ్లమీద వెళ్తున్న పీతలను స్థానికులు.. వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఎర్ర పీతల దండుని మీరు కూడా చూసేయండీ..

Read more : ‘Rain of Corpses’ : రాత్రికి రాత్రే చచ్చిపోయిన వందలాది పక్షులు..