‘Rain of Corpses’ : రాత్రికి రాత్రే చచ్చిపోయిన వందలాది పక్షులు..

బాలిలో వందలాది పక్షులు రాత్రికి రాత్రే చనిపోయి పడి ఉన్నాయి. న్నపళంగా వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోవటం వెనుక కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

‘Rain of Corpses’ : రాత్రికి రాత్రే చచ్చిపోయిన వందలాది పక్షులు..

‘rain Of Corpses’ (1)

‘Rain of corpses’ in Indonesia’s bali : ఇండోనేషియాలో అత్యంత విషాదక ఘటన జరిగింది.కిలకిలా ఎగురుతున్న పక్షులు హఠాత్తుగా నేల రాలిపోయాయి. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి అంటారే అచ్చం అలాగే వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోయి నేల రాలిపోయిన ఘటన అత్యంత హృదయవికారంగా కనిపిస్తుంది. వందలాది పిచ్చుకలు చచ్చిపోయి పడి ఉండటం చూసిన జనాలు హడలిపోతున్నారు. దీనికి కారణమేంటీ?అనే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో సెప్టెంబర్ 9న వందల సంఖ్యలో పక్షుల మృతదేహాలు కుప్పకూలి పడి ఉంటంతో ఆ ప్రాంతమంతా ఏదో నల్లటి కార్పెట్ పరిచినట్లుగా భీతావహకంగా కనిపిస్తోంది. ఎక్కడన్నా ఒక్క పక్షి చనిపోయి పడి ఉంటం చూస్తేనే ఎంతో బాధ కలుగుతుంది. కాసేపు దాన్ని అలా చూస్తుండిపోతాం. అటువంటిది ఒకేచోట వందలాది పక్షులు చచ్చి పడి ఉంటడం జనాలకు కలిచివేస్తోంది.

Read more : వందలాది పక్షుల ప్రాణాలు తీసిన న్యూ ఇయర్ వేడుకలు

ఈ ఘటనపై అధికారులు..పక్షులు ఈ స్థాయిలో చనిపోవడం వెనుక వాతావరణంలో మార్పులే కారణమని భావిస్తున్నారు.కాగా..బాలిలోని స్మశాన వాటికలో చనిపోయిన పిచ్చుకల శవాలను చూసి పర్యాటకులు, స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొందరు వ్యక్తులు ఈ పక్షుల మరణాలకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

బాలిలోని స్మశానవాటికలో నల్లటి వస్తువులు పరిచినట్లుగా పడి ఉన్నాయి పక్షులు. అవేంటాని కొంచెం దగ్గరగా వెళ్లి చూస్తేగానీ అవన్నీ పక్షుల శవాలు అని తెలియటంలేదు. వందలాది పిచ్చుకలు నిర్జీవంగా పడి ఉండటం చాలా బాధకలిగిస్తోంది. వందల సంఖ్యలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. గతంలో ఇటువంటి ఘటన జరుగలేదని..అంటున్నారు స్థానికులు. గతరోజు సాయంత్ర చచ్చిపోయిన ఒక్క పక్షి కూడా కనిపించలేదు. కానీ తెల్లారేసరికే ఇలా వందలాది పక్షులు చనిపోయి గుట్టలుగా పడి ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారు. రాత్రికి రాత్రే ఇంతటి ఘోరం ఎలా జరిగింది? దీనికి కారణమేంటీ అని మధనపడుతున్నారు.

Read more :Bird flu : చైనాలో మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ..అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

ఇన్ని పిచ్చుకల మృతికి వాతావరణంలో మార్పు లేదా ఆమ్ల వర్షం కారణం అయి ఉండొచ్చని జియానార్ రీజెన్సీలోని జంతు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి మెడ్ శాంటియార్కా వెల్లడించారు.కానీ ఆ తరువాత మాత్రం పురుగుల మందు కారణంగానే వందలాది పిచ్చుకలు చనిపోయాయని నిర్ధారణకు వచ్చారు. కానీ దీనిపై పూర్తి క్లారిటీ రాలేదు. పక్షుల అవశేషాలకు పోస్ట్ మార్టం చేస్తేనే గానీ ఏదీ పూర్తిగా తెలియదని అధికారులు అంటున్నారు. దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.