Covid-19 Test : ఇంట్లోనే కొవిడ్ పరీక్ష! ధర తక్కువ.. గంటలోనే ఫలితం!

ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది. టెస్టింగ్ సెంటర్ కి వెళ్లాలి. అక్కడ రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ క్రమంలో బాధితుడికి కొంత నొప్పి కలగడం సహజం. ఆ తర్వాత శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపుతారు. రిజల్ట్ రావడానికి బాగా సమయం పడుతుంది. అయితే, ఈ బాధలేవీ లేకుండా సొంతంగా ఇంట్లోనే కరోనా నిర్ధారణ టెస్ట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తే

Covid-19 Test : ఇంట్లోనే కొవిడ్ పరీక్ష! ధర తక్కువ.. గంటలోనే ఫలితం!

Covid 19 Test

Covid-19 Test : ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది. టెస్టింగ్ సెంటర్ కి వెళ్లాలి. అక్కడ రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ క్రమంలో బాధితుడికి కొంత నొప్పి కలగడం సహజం. ఆ తర్వాత శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపుతారు. రిజల్ట్ రావడానికి బాగా సమయం పడుతుంది. అయితే, ఈ బాధలేవీ లేకుండా సొంతంగా ఇంట్లోనే కరోనా నిర్ధారణ టెస్ట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తే బాగుంటుంది అని అనుకోని వారు ఉండరు. అలాంటి వారికి సైంటిస్టులు ఊరటనిచ్చే వార్త చెప్పారు.

సొంతంగా ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు వీలు కల్పించే ఒక డివైజ్ ను అమెరికా సైంటిస్టులు డెవలప్ చేశారు. ఇది లాలాజలాన్ని(సలైవా) విశ్లేషిస్తుందని, చాలా చీప్ అని చెప్పారు. హార్వర్డ్‌ వర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు.

The miSHERLOCK team

”ఈ సాధనం పేరు ‘మినిమల్లీ ఇన్‌స్ట్రూమెంటెడ్‌ షెర్లాక్‌’ (మి షెర్లాక్‌). దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. గంటలోగా మన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌పై ఫలితాన్ని పొందొచ్చు. ఇది కరోనాలోని మూడు భిన్న వేరియంట్లను విజయవంతంగా గుర్తించగలిగింది. డెల్టా వంటి అదనపు రకాలను గుర్తించేలా సాధనంలో సర్దుబాటు చేయవచ్చు” అని సైంటిస్టులు తెలిపారు. త్రీడీ ప్రింటర్, అందుబాటులో ఉన్న ఉపకరణాల సాయంతో ఈ యంత్రాన్ని సిద్ధం చేసినట్లు వారు వెల్లడించారు. రోగి శాంపుల్స్ ను టెస్టింగ్ సెంటర్ కి తరలించాల్సిన అవసరాన్ని మి షెర్లాక్‌ తప్పిస్తుందన్నారు. అంతేకాదు సలైవా శాంపిల్స్ ను పరీక్షిస్తున్నందు వల్ల బాధితులకు ఎలాంటి నొప్పి ఉండదన్నారు.

The miSHERLOCK Device

ఇక దీనివల్ల ఒక ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య స్థితి గురించి డాక్టర్లకు చాలా త్వరగా, మరింత స్పష్టమైన సమాచారం లభిస్తుందన్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఇది చాలా కీలకం అని పరిశోధనలో పాలుపంచుకున్న హెలీనా డి పగ్‌ చెప్పారు. జన్యువుల్లో మార్పులు చేయడానికి ఉపయోగించే క్రిస్పర్‌ పరిజ్ఞానంతో ‘మి షెర్లాక్‌’ను తయారు చేశారు. ఇది క్రిస్పర్‌లోని కాస్‌12ఎ అనే పరమాణు కత్తెరను ఉపయోగించుకొని, కరోనా వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏలో ఉన్న న్యూక్లియోప్రొటీన్‌ ప్రాంతాన్ని కత్తిరిస్తుంది. ఈ క్రమంలో ఒక ఫ్లోరసెంట్‌ సంకేతం వెలువడుతుంది. దీని ఆధారంగా కరోనా ఉనికిని గుర్తించొచ్చు. వైరస్‌లోని ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను ఈ సాధనం సులువుగా పసిగడుతుంది.