పర్వతమంతా బంగారమే.. మట్టి తవ్వడం కడుక్కొని దాచుకోవడమే

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో నిజంగానే ట్రెజర్ హంట్ జరుగుతుంది. ఆ ప్రాంతంలోని పర్వతంలో బంగారం ఉందని తెలిశాక ప్రభుత్వం గ్రామాన్ని నిషేదించింది. అహ్మద్ అల్గోబరీ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలో లుహిహీ అనే పర్వతాన్ని..

పర్వతమంతా బంగారమే..  మట్టి తవ్వడం కడుక్కొని దాచుకోవడమే

Gold Mountain: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో నిజంగానే ట్రెజర్ హంట్ జరుగుతుంది. ఆ ప్రాంతంలోని పర్వతంలో బంగారం ఉందని తెలిశాక ప్రభుత్వం గ్రామాన్ని నిషేదించింది. అహ్మద్ అల్గోబరీ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలో లుహిహీ అనే పర్వతాన్ని తవ్వుతున్న దృశ్యం కనిపిస్తుంది. కాంగోలోని దక్షిణ కివూ ప్రాంతంలో ఈ పర్వతం ఉంది.

ఒక వీడియోలో పలుగు, పారలతోటి రెడీ అయిపోయి తవ్వేసుకుంటున్నారు. నేలను పలు రకాలుగా తవ్వి చేతులతోనే బంగారం వెలికి తీస్తున్నారు.

‘రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డాక్యుమెంట్స్ నుంచి గ్రామస్థులకు బిగ్ సర్‌ప్రైజ్ గా మిగిలింది. పర్వతమంతటా బంగారమయమే. దానిని తవ్వి బంగారాన్ని ఇంటికి తీసుకుపోతున్నారు. దానిని కడుక్కోవడం దాచుకోవడమే వాళ్ల పని. మరో వీడియోలో మురికినీటిలో నుంచి బంగారం బయటకు తీయడం చూడొచ్చు.

ఇదిలా ఉంటే ఇతర గ్రామస్థులు కూడా వారిపై ఒత్తిడి పెంచేస్తున్నారు. అధికారులు ఆ గ్రామంలో మైనింగ్ ను నిషేదించినా ఖాతరు చేయడం లేదని అక్కడి మంత్రి ముహిగిర్వా అంటున్నారు.

నిజానికి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రాంతం వారు బేసిక్ టూల్స్ తోనే విలువైన ఖనిజాలు బయటకు తీస్తారు. కాంగో ప్రాంతంలో ఎప్పుడూ టింబర్, వజ్రాలు, మినరల్స్ లాంటివి పుష్కలంగా దొరుకుతుంటాయి. ఈ దేశంలో గోల్డ్ బయటకు తీయడాన్ని ఆర్టిసనల్ గోల్డ్ మైనింగ్ అంటారు.