Twitter Blue Tick: ట్విటర్ బ్లూ‌టిక్‌ పునరుద్దరణపై క్లారిటీ ఇచ్చిన మస్క్.. వచ్చేవారం నుంచి అందుబాటులోకి..

ట్విటర్ యాప్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బ్లూటిక్ సబ్ స్ప్రిప్షన్ ఫీచర్ కూడా కనిపించడం లేదు. బ్లూటిక్ స్ప్రిప్షన్ ఎప్పుటి నుంచి ప్రారంభమవుతుందా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై పాల్ జమీల్ అనే ట్విటర్ ఖాతాదారుడు మస్క్ ను ప్రశ్నించాడు. ట్విట్టర్ బ్లూ టిక్ ఎప్పుడు తిరిగి వస్తుందంటూ ప్రశ్నించారు.

Twitter Blue Tick: ట్విటర్ బ్లూ‌టిక్‌ పునరుద్దరణపై క్లారిటీ ఇచ్చిన మస్క్.. వచ్చేవారం నుంచి అందుబాటులోకి..

Twitter Blue Tick

Twitter Blue Tick: ట్విటర్ ఖాతాకు బ్లూటిక్ పొందే సదుపాయాన్ని ట్విటర్ తాత్కాలికంగా నిలిపివేసింది. నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లూటిక్ విషయంలో ప్రీమియం సేవలను మస్క్ ఇటీవల ప్రవేశపెట్టిన విషయం విధితమే. దీని ప్రకారం.. ఎటువంటి పరిశీలన లేకుండానే 8డాలర్లు చెల్లించి బ్లూటిక్‌ను పొందే వీలుంటుంది. దీంతో కొంత మంది ప్రముఖులు, సంస్థల పేరిట నకిలీ ఖాతాలు తెరిచి సబ్ స్ప్రిప్షన్ తీసుకున్నట్లు ట్విటర్ గుర్తించింది. ఈ క్రమంలో ఏది నకిలీనో, ఏదీ అసలు ఖాతానో తెలియని అయోమయపరిస్థితి.

Twitter Blue Subscription : మస్క్ మామూలోడు కాదుగా.. ట్విట్టర్ యూజర్లకు షాక్.. బ్లూ సబ్‌స్ర్కిప్షన్ ఫీచర్ మాయం.. ఇకపై బ్లూ టిక్ పొందలేరు!

తాజా పరిణామాలపై పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో ట్విటర్ ప్రస్తుతానికి బ్లూటిక్ సేవలను ఆపేసినట్లు తెలిసింది. ట్విటర్ యాప్ లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బ్లూటిక్ సబ్‌స్ప్రిప్షన్ ఫీచర్ కూడా కనిపించడం లేదు. బ్లూటిక్ సబ్‌స్ప్రిప్షన్ ఎప్పుటి నుంచి ప్రారంభమవుతుందా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై పాల్ జమీల్ అనే ట్విటర్ ఖాతాదారుడు మస్క్ ను ప్రశ్నించాడు. ట్విట్టర్ బ్లూ టిక్ ఎప్పుడు తిరిగి వస్తుందంటూ ప్రశ్నించారు.

పాల్ జమీల్ ట్వీట్ కు స్పందించిన ఎలాన్ మస్క్ బహుశా వచ్చేవారం లాస్ట్ వరకు అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పేరడీ ఖాతాలు కలిగిఉన్నవారు బయోలో కాకుండా పేరులోనే పేరడీ అనే పదాన్ని జతచేయాలని మస్క్ తెలిపాడు. అలా ఉన్న ఖాతాలను పరోక్షంగా నకిలీవని అర్థం చేసుకోవచ్చని మస్క్ సూచించాడు.