Asteroid : భూమికి అత్యంత దగ్గరగా గ్రహ శకలం.. చరిత్రలోనే తొలిసారి

ఓ గ్రహ శకలం భూమికి అత్యంత సమీపానికి రానుంది. ఇది చరిత్రలోనే తొలిసారి జరుగనుంది. ‘ఆస్టరాయిడ్-2023’ దక్షిణ అమెరికా మీదుగా భూ ఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Asteroid : భూమికి అత్యంత దగ్గరగా గ్రహ శకలం.. చరిత్రలోనే తొలిసారి

asteroid

Asteroid : ఓ గ్రహ శకలం భూమికి అత్యంత సమీపానికి రానుంది. ఇది చరిత్రలోనే తొలిసారి జరుగనుంది. ‘ఆస్టరాయిడ్-2023’ దక్షిణ అమెరికా మీదుగా భూ ఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ట్రక్కు బాక్స్ పరిమాణంలో ఉండే గ్రహ శకలం ఈ వారంలోనే భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా పరిశోధకులు వెల్లడించారు.

అయితే, ఈ ఆస్టరాయిడ్ తో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ భూమిని ఢీ కొట్టినా.. 3.5 మీటర్ల నుంచి 8.5 మీటర్ల పరిమాణంలో ఉండే ఈ గ్రహ శకలం భూ వాతావరణంలో ఏదో ఒక చోట విచ్చిన్నం అవుతుందని పేర్కొన్నారు.