Neigeria girls “Trashion Show” : ప్లాస్టిక్ వ్యర్థాల డ్రెస్సులు వేసుకుని..స్టేజ్ పై ర్యాంప్ వాక్ తో అమ్మాయిల అద్భుత సందేశం

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన డ్రెస్‌లు ధరించి ‘గ్రీన్‌ ఫింగర్స్‌ వైల్డ్‌ లైఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్‌ షో’ అనే పేరుతో ఓ షో ఏర్పాటు చేసి ఆ వ్యర్ధాల డ్రెస్సులు వేసుకుని స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేశారు నైజీరియాకు చెందిన టీనేజ్ అమ్మాయిలు. వినూత్న ఐడియాతో వీరు రూపొందించిన ఈ ప్లాస్టిక్‌ వస్త్రాలు అందర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ షోలో ఫ్యాషన్ డ్రెస్సుల మాదిరిగానే ప్లాస్టిక్ వ్యర్థాలతో రంగురంగుల షాపింగ్ బ్యాగ్స్, చెత్తడబ్బల వంటి వాటినీ తయారు చేసి షాపింగ్‌ మాల్స్‌ వద్ద అమ్ముతున్నారు కూడా.

Neigeria girls “Trashion Show” : ప్లాస్టిక్ వ్యర్థాల డ్రెస్సులు వేసుకుని..స్టేజ్ పై  ర్యాంప్ వాక్ తో అమ్మాయిల అద్భుత సందేశం

Traction Show (1)

Neigeria girls “Trashion Show” : ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు కడుతున్నారు.రోడ్లు వేస్తున్నారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెస్సులు కూడా తయారు చేస్తారనే విషయం తెలుసా? అంతేకాదు అలా ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన డ్రెస్సులు వేసుకుని ఫ్యాషన్ షో నిర్వహించారు నైజీరియాలో అమ్మాయిలు. వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల పర్యావరణానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ వినియోగం గురించి పర్యావరణవేత్తలు నెత్తీ నోరు బాదుకుని మరీ చెబుతున్నారు. అయినా ప్లాస్టిక్ వినియోగానికి మాత్రం ఫుల్ స్టాప్ కాదుకదా..కనీసం కామా కూడా పడటంలేదు. పర్యావరణానికి హాని జరుగుతోందీ అంటూ మానవాళికి కూడా హాని జరిగినట్లేననే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. అలా ప్లాస్టిక్ వాడకాల వల్ల పెరుగుతున్న కాలుష్యం నైజీరియాలోని అమ్మాయిలను కదిలించింది. ఓ వినూత్న సందేశం ఇచ్చేలా చేసింది. అదే ప్లాస్టిక్ వ్యర్ధాలతో డ్రెస్సులు తయారు చేసి వాటిని వేసుకుని షో నిర్వహించటం..

7

కాలుష్యంతో ఏర్పడే సమస్యల గురించి ప్రపంచ పర్యావరణ వేత్తల ఆందోళనను నైజిరియా అమ్మాయిల మనస్సుల్ని తాకాయి. దీంతో వారు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు నడుం బిగించారు. వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యాషన్ బుల్ డ్రెస్సులు, బ్యాగులు తయారు చేస్తూ ప్లాస్టిక్ వాడితే పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందోనని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నైజీరియాకు చెందిన 15 ఏళ్ల ఎసోహి ఒజిగ్బో ‘ట్రాషన్‌ షో’ ద్వారా ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ఎలా నివారించవచ్చు అని చెబుతుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది.

Nigerian Teen Girls

నైజీరియాలోని లాగోస్‌ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడి ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఓ కార్యక్రమం చేపట్టారు. చెత్తడబ్బల్లో పడి ఉండే ప్లాస్టిక్ వ్యర్థాల్ని, డ్రైనేజీ నీళ్లల్లో తేలియాడే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించి..దుస్తులను తయారు చేస్తున్నారు. ఆ వ్యర్థాలతో పలు రకాల వస్తువుల్ని కూడా తయారు చేస్తున్నారు. వ్యర్ధాలతో తయారైన డ్రెస్సులు ఫ్యాషనబుల్‌ గా తయారు చేయటం వీరి స్పెషాలిటీ.

అంతేకాదు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన డ్రెస్‌లు ధరించి ‘గ్రీన్‌ ఫింగర్స్‌ వైల్డ్‌ లైఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్‌ షో’ అనే పేరుతో ఓ షో ఏర్పాటు చేసి ఆ వ్యర్ధాల డ్రెస్సులు వేసుకుని స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేశారీ టీనేజ్ అమ్మాయిలు. వినూత్న ఐడియాతో వీరు రూపొందించిన ఈ ప్లాస్టిక్‌ వస్త్రాలు అందర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ షోలో ఫ్యాషన్ డ్రెస్సుల మాదిరిగానే ప్లాస్టిక్ వ్యర్థాలతో రంగురంగుల షాపింగ్ బ్యాగ్స్, చెత్తడబ్బల వంటి వాటినీ తయారు చేసి షాపింగ్‌ మాల్స్‌ వద్ద అమ్ముతున్నారు కూడా.

12

లాగోస్‌ నగరం నైజీరియాకు వాణిజ్య రాజధాని. దీంతో ఈ నగరంలో నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్‌ వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు నగరంలోని చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులల్లోకి ప్రవహిస్తున్నాయి. అవి అలా సముద్రాల్లో నీటి ప్రవాహాల్లో కూడా కలిసిపోయి తీవ్రమైన హానికి దారి తీస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎంతగా ఉన్నాయంటే సముద్ర ప్రవాహానికి కూడా అడ్డుపడేంతగా ఉన్నాయి. అలా అవి నీటి ప్రవాహంపై చాప మాదిరిగా తేలుతున్నాయి. ఈ దారుణానికి ఫలితంగా నదుల్లోను, సముద్రాల్లోను జీవించే జలచరాలకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. వీటి మనుగడనే ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాల ప్రమాదం రోజురోజుకి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడంలేదు.

30

దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించిన ఈ అమ్మాయిలకు వచ్చిందే ప్లాస్టిక్ వ్యర్ధాలతో డ్రెస్సులు, వస్తువులు తయారు చేయాలనే ఆలోచన. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను తగిన జాగ్రత్తలు పాటిస్తూ వాటిని సేకరించి.. శుభ్రం చేసి..వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి..ఫ్యాబ్రిక్‌ తో కలిపి కుట్టి మోడల్‌ డ్రెస్సుల్లాగా..హ్యాండ్ బ్యాగులు, పర్సులు వంటివి తయారు చేస్తున్నామని తెలిపారు. మేము రూపొందించిన వాటిని ప్రదర్శించేందుకు ట్రాషన్‌ షో మంచి వేదిక అయిందనీ..తెలిపారు ఈ టీనేజర్లు. ఈ సందర్భంగా ఈ టీనేజ్ అమ్మాయిలు మాట్లాడుతూ..‘‘మేమంతా టీనేజర్లం.. ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి మాలో ఉంది. అందుకే స్వీడిష్‌ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌ బర్గ్‌ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టి అందరం కలిసి ముందుకు సాగుతున్నాం’ అని తెలిపారు.