కరోనా స్ట్రెయిన్, 20 ఏళ్ల లోపు వారు జాగ్రత్త, వేగంగా వ్యాపించే ప్రమాదం : సైంటిస్టుల హెచ్చరిక

కరోనా స్ట్రెయిన్, 20 ఏళ్ల లోపు వారు జాగ్రత్త, వేగంగా వ్యాపించే ప్రమాదం : సైంటిస్టుల హెచ్చరిక

‘super-COVID’ is nearly 50 percent : కొత్త రకం కరోనా స్ట్రెయిన్ భయకంపితులను చేస్తోంది. బ్రిటన్ లో ఇప్పటికే శరవేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. బ్రిటన్ లో లాక్ డౌన్ పెట్టినా..స్ట్రెయిన్ వ్యాప్తి మూడు రెట్లు పెరిగిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. లండన్ ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన జరిపారు. ఎంత వేగంగా వ్యాపిస్తుందో పరిశోధన చేసి చెప్పారు.

వైరస్ ప్రత్యుత్పత్తి రేటు అంటే..ఆర్ వ్యాల్యూ పై ఈ పరిశోధనలు జరిపారు. మాములు వైరస్‌తో పోలిస్తే…రూపం మార్చుకున్న కొత్త రకం కరోనా ప్రత్యుత్పత్తి రేటు 0.7 దాకా పెరిగిందని వెల్లడించారు. ఆర్ వాల్యూ 1.1 నుంచి 1.4 మధ్య ఉందని, దీనిని ప్రస్తుతం 1 కన్నా తక్కువకు తీసుకరావాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ ఏక్సెల్ గ్యాండీ తెలిపారు. కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి సరాసరిన ఎంతమందికి మళ్లీ సోకుతుందో తెలియచేస్తుందని, పాత వైరస్, కొత్త స్ట్రెయిన్ మధ్య ఆర్ విలువ అంతరం చాలా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

SARS-CoV-2 variant

నవంబర్ నెలలో లాక్ డౌన్ పెట్టిన సమయంలో..పాత వైరస్ మూడు రెట్లు పెరిగిందని, 20 ఏళ్లలోపు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిలోనే కొత్త స్ర్టెయిన్ వేగంగా వ్యాపిస్తోందని, చిన్నారుల్లోనూ..అధికంగా విస్తరిస్తోందన్నారు.  యూకేలో 2 వేల మంది నుంచి నమూనాలు తీసుకున్నారు. వీటిని మరో 84 వేల మందితో పోల్చారు. కొత్త వైరస్ యుఎస్‌లో ప్రబలంగా ఉందని, కేసులను 48శాతం పెంచుతుందన్నారు. అలస్కాలో 0.86, Maineలో 1.23గా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ లో అంటువ్యాధుల పెరుగుదలకు దారి తీసిందన్నారు.