Africa split Two Continents : రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా..! మరో కొత్త ఖండం పుట్టుక..మరో కొత్త సముద్రం ఆవిర్భావానికి నాంది..!!

ప్రపంచ పటంలో ‘ఏడు ఖండాలు కాదు ఎనిమిది ఖండాలు’ ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు..!! ఓ కొత్త ఖండం పుట్టుకకు ప్రక్రియ మొదలైందంటున్నారు. అంతేకాదు కొత్త ఖండం పుట్టుకతో మరో కొత్త సముద్రం కూడా ఆవిర్భవించనుందని చెబుతున్నారు.

Africa split Two Continents : రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా..! మరో కొత్త ఖండం పుట్టుక..మరో కొత్త సముద్రం ఆవిర్భావానికి నాంది..!!

Africa split Two Continents

Africa split Two Continents : ఒకప్పుడు ఈ భూమి ఒక్కటి (ఒకే ఖండం)గానే ఉందని. తరువాత భూమిలో వచ్చిన మార్పులతో ఖండాలు ఏర్పడ్డాయని అంటారు.అలా ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా మొత్తం ఏడు ఖండాలుగా ఏర్పడ్డాయని భూగోళ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ ఇప్పుడు భూమిలో వస్తున్న పెను మార్పులు ‘ఎనిమిదవ’ఖండం పుట్టుక జరగనుందని శాస్త్రవేత్తలు. చెబుతున్నారు. అంటే ప్రపంచ పటంలో ‘ఏడు కాదు ఎనిమిది ఖండాలు’ ఉంటాయన్నమాట..!!

ఇవి కేవలం ఊహాగానాలు కాదు నిజమేననే సంకేతలు మొదలయ్యాయి ఇప్పటికే..చీకటి ఖండంగా పేరొందిన ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోతుందట..దీని నుంచి ఈ ఎనిమిదవ ఖండం ఆవిర్భవించనుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోయి ఎనిమిదవ ఖండం ఏర్పడుతుందట..అంటే చీలిపోయిన ఈ ఖండాల మధ్య మరో సముద్రం ఏర్పడబోతోందని… ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు భూమి లోపలా, భూమి పైనా కూడా ప్రారంభమయ్యాయని చెబుతున్నారు భూగర్భ నిపుణులు..! ఈ ఎనిమిదవ ఖండం ఏర్పడటం ఇప్పటికిప్పుడే జరకపోయినా కొన్ని వేల ఏళ్లలో ఇది జరుగుతుందని ఈ ఖండాల మధ్య సరికొత్తగా ఓ సముద్రం ఏర్పడబోతోందని చెబుతున్నారు.

భూభాగం నిరంతరం మారుతూనే వస్తోంది. కానీ ఈ మార్పులు వెంటనే కనిపించవు. అవి తీవ్రతరమైతేనే గానీ ఆ తేడా కనిపించదు. ఆ మార్పులు కనిపించాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అటువంటి పెను మార్పుకు ఆఫ్రికా ఖండం వేదికవుతోంది. ఆఫ్రికా ఖండంలో మార్పులు కనిపిస్తున్నాయి. భూమి రెండుగా చీలిపోతుందనటానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆఫ్రికా ఖండం రెండుగా చీలి రెండు ఖండాలుగా ఏర్పడబోతోందనటానికి సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు..ఈ ఏర్పాటులో ఈ రెండు ఖండాలమధ్య కొత్తగా ఓ సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ మార్పునే శాస్త్రవేత్తలు తూర్పు ఆఫ్రికా చీలికగా పేర్కొంటున్నారు.

టెక్టానిక్‌ ప్లేట్‌ (భూగర్భంలోని ఒక పలక)రెండుగా విడిపోవటాన్ని శాస్త్రవేత్తలు చీలికగా పేర్కొంటున్నారు. ఈ పలకలు (టెక్టానిక్‌ ప్లేట్లు) కదలటం ఆరంభమైనప్పుడు లోయలాంటి పగుళ్లు భూ ఉపరితలంపైనా, భూగర్భంలోనూ ఏర్పడతాయి. 138 మిలియన్‌ సంవత్సరాల కిందట ఇలాంటి పరిణామం వల్లే దక్షిణ అమెరికా, ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. గత 30 మిలియన్ సంవత్సరాలుగా అరేబియా ప్లేట్ ఆఫ్రికా నుంచి దూరంగా వెళుతోంది. ఈ ప్రక్రియ ఫలితంగా ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ ఏర్పడింది. 2005లో ఇథియోపియా ఎడారిలో 56 కిలోమీటర్ల పొడవునా భారీ పగులు ఏర్పడింది.

2018లో కెన్యాలో కూడా ఇటువంటి భారీ పగులు కనిపించింది. సముద్రం కిందిభాగంలో పలకల కదలికల (టెక్టానిక్‌ ప్రక్రియ) కారణంగానే ఇది సంభవించిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆఫ్రియన్ నుబియన్, ఆఫ్రికన్ సోమాలి, అలాగే అరేబియన్ అనే పలకల వద్ద పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త సముద్రం ఏర్పడటానికి సూచనలుగా భావిస్తున్నారు. అలా భూమిలోపల పలకల కదలికల ద్వారా మొదలయ్యే భారీ పగుళ్లు, భూ ఉపరితంమీది వరకు వస్తాయి. అలా భూమి రెండు చీలిపోతూ సముద్ర ఆవిర్బావానికి కారణం కాబోతోంది అని లీడ్స్ యూనివర్శిటీ పరిశోధకులు క్రిస్టఫర్ మూర్ తెలిపారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్ర సముద్రంలోని నీరే ఈ పగులులోకి ప్రవేశించి కొత్త సముద్రంగా రూపాంతం చెందుతుందని చెబుతున్నారు. అలా కొత్త ఖండాల ఏర్పాటు కొత్త సముద్రం ఏర్పాటుకు దారి తీస్తుందంటున్నారు.

ఇలా వేల కిలోమీటర్ల పొడుగునా ఉండే ఈ భారీ చీలిక వల్ల ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉన్న సోమాలియా, ఇథియోపియా, టాంజానియా,కెన్యా సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలో కొన్ని ప్రాంతాలు కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇలా కొత్త ఖండం..కొత్త సముద్రం ఏర్పడటానికి 5 మిలియన్ల నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ చీలిక ఏర్పడిన ఉప ఖండంలోకి సోమాలియా, ఇథియోపియా, టాంజానియా,కెన్యా సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలో కొన్ని ప్రాంతాలు వచ్చి ఓ కొత్త ఖండంగా రూపాంతం చెందుతాయి.

ఈ కొత్త ఖండం..కొత్త సముద్రం ఏర్పాటు వల్ల ఇప్పుడు సముద్రం లేని ఉగాండా, జాంబియాలకు సముద్ర తీరప్రాంతం వస్తుంది. ఈ అంశంపై నైరోబీ విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్ర విభాగం పరిశోధకుడు ఎడ్విన్‌ డిండి మాట్లాడుతూ..చీలిక లోయలో తూర్పుభాగంలో మార్పులు వేగంగా కనిపిస్తున్నాయని..కానీ ఈ మార్పులకు ఓ ప్రత్యేక రూపం ఏర్పడటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని వివరించారు.