Varun Sandesh : ‘విరాజి’తో రాబోతున్న వరుణ్ సందేశ్.. కొత్త అవతారం అంటూ..

వరుణ్ సందేశ్ ఇటీవలే నింద సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు.

Varun Sandesh : ‘విరాజి’తో రాబోతున్న వరుణ్ సందేశ్.. కొత్త అవతారం అంటూ..

Varun Sandesh coming with New Movie Viraaji Title Announcement Video Released

Updated On : July 2, 2024 / 9:15 PM IST

Varun Sandesh : వరుణ్ సందేశ్ ఇటీవలే నింద సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు. తాజాగా నేడు వరుణ్ సందేశ్ తన నెక్స్ట్ సినిమా ‘విరాజి’ అని టైటిల్ అనౌన్స్ చేసారు. ఈ సినిమాని మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా.. పలువురు నటించారు.

విరాజి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు 2న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ‘విరాజి’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ నిర్వహించారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హారర్, థ్రిల్లర్ స్టోరీ అని తెలుస్తుంది.

Also Read : Tiragabadara Saami Trailer : రాజ్‌ తరుణ్‌ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వ‌చ్చేసింది..

విరాజి సినిమా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ఇది చాలా మంచి టైటిల్. వరుణ్ సందేశ్ గారు ఇప్పటిదాకా చాలా మంచి సినిమాలు చేసారు. ఆయన్ని కొత్త అవతారంలో ఈ సినిమా చూపిస్తుంది. ఆగస్టు 2న సినిమా రిలీజ్ చేస్తాం. నెల రోజుల్లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తాం అని తెలిపారు.

డైరెక్టర్ ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ.. డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా, ఇది నా మొదటి ఈవెంట్. మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర గారికి, ప్రొడ్యూసర్ మహేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేసారు. వరుణ్ సందేశ్ కు ఇది టైలర్ మేడ్ మూవీ అవుతుంది అని తెలిపారు.

Varun Sandesh

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. విరాజి కథ చెప్పేటప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశాను. సెకండాఫ్ విని నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుంది. డైరెక్టర్ హర్ష కు లాంగ్ కెరీర్ ఉంటుంది. నేను ఇటీవల చేసిన నింద సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పదేళ్ల తర్వాత నా సినిమాకి అలాంటి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నింద సినిమా సక్సెస్ నాకు మంచి మోటివేషన్, బూస్ట్ ఇచ్చింది. విరాజి సినిమాకు ఇంకో నెల రోజులు మాత్రమే టైం ఉంది. నా 17 ఏళ్ల కెరీర్ లో ఒక డిఫరెంట్ సినిమా ఇది. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అవ్వడానికి గంట సమయం పట్టేది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.