New Year Celebrations : ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు.. ఆక్లాండ్‌లో తొలి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్

మొదటగా న్యూజిలాండ్ 2022కు ఆహ్వానం పలికింది. కొంగొత్త ఆశలతో ప్రారంభించింది. గతకాలపు జ్ఞాపకాలను మోసుకొంటూ రేపటి కలలు కంటూ కొత్త ఏడాదికి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తెర తీస్తున్నాయి.

New Year Celebrations : ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు.. ఆక్లాండ్‌లో తొలి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్

World 11zon

New Year celebrations around the world : ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2021కి వీడ్కోలు పలుకుతూ 2022కు స్వాగతం పలికారు. పలు దేశాలు భారత్‌కంటే ముందుగా కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పాయి. 2021లో ఎన్నో మధుర జ్ఞాపకాలు, క్షణాలను, మంచిచెడులను వదిలి కొత్త ఏడాదిలో ప్రయాణం సాగించేందుకు సిద్ధమయ్యారు ప్రజలంతా. కొత్త ఏడాదిలో భవిష్యత్‌ బంగారుమయం అవ్వాలని, సంతోషంగా గడిచిపోవాలని కోరుతూ, కోటి ఆశలతో ఆనందంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఆక్లాండ్‌లో తొలి న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. బాణాసంచా వెలుగుల్లో.. ఆక్లాండ్‌ మెరిసిపోతోంది. అటు నార్త్‌ కొరియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి.

మొదటగా న్యూజిలాండ్ 2022కు ఆహ్వానం పలికింది. కొంగొత్త ఆశలతో 2022ని ప్రారంభించింది. గతకాలపు జ్ఞాపకాలను మోసుకొంటూ.. రేపటి కలలు కంటూ.. నూతన ఏడాదికి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తెర తీస్తున్నాయ్‌. 2021 ఇచ్చిన గుర్తుల్ని గుండెల్లో దాచుకొని.. సరైన దారుల్ని వెతుక్కొంటూ 2022లోకి అడుగుపెడుతున్నాయ్‌. బాణాసంచా వెలుగులు, లేజర్‌ షోలతో న్యూజిలాండ్ వాసులు మొదటిగా కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులు, లేజర్‌ షోలతో న్యూజిలాండ్ వాసులు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.

New Year Celebrations : వెల్‌కమ్ 2022.. బైబై 2021 : తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్

న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా 2022కు ఆహ్వానం పలికింది. సిడ్నీలోని హార్బర్‌లో విద్యుత్ కాంతులతో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా ఆకాశంలోకి దూసుకుపోతూ 2021ని తీసుకెళ్లింది. 2022కు ఉత్సాహంగా ఆస్ట్రేలియా జనం స్వాగతం పలికారు. హార్బర్‌లోని ప్రముఖ బ్రిడ్జిపై జిగేల్‌మనే లైటింగ్ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు పెరగడంతో వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో జనం ఎక్కువ కనిపించలేదు.

నార్త్ కొరియా 2022కి గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పింది. టడాంగ్ నదిపై బాణసంచా పేల్చుతూ ఆహ్వానం పలికారు. పెద్ద ఎత్తున జనం పాటలు పాడుతూ, కేరింతలతో వెల్‌కమ్‌ చెప్పారు. విద్యుత్ వెలుగులతో, బాణసంచాతో ఆ ప్రాంతమంతా పండుగ కల కనిపించింది. కోటీ ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.