August 31 Withdrawal Deadline : అమెరికా అఫ్ఘానిస్తాన్‌ను ఖాళీ చేసేందుకు రేపే డెడ్‌లైన్!

అప్ఘానిస్తాన్.. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం.. ఆగస్టు 15 తాలిబన్లు ఆక్రమించిన రోజు.. ఆగస్టు 31వరకు అమెరికాకు డెడ్‌లైన్.. అప్ఘాన్ ఖాళీ చేయాల్సిన రోజు.. ఇప్పుడా డెడ్‌లైన్ ముగుస్తోంది.

August 31 Withdrawal Deadline : అమెరికా అఫ్ఘానిస్తాన్‌ను ఖాళీ చేసేందుకు రేపే డెడ్‌లైన్!

No Extensions To August 31 Withdrawal Deadline

August 31 Withdrawal Deadline : అప్ఘానిస్తాన్.. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం.. ఆగస్టు 15 అప్ఘాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన రోజు.. ఆగస్టు 31వరకు అమెరికాకు డెడ్‌లైన్.. అప్ఘాన్ ఖాళీ చేయాల్సిన రోజు.. ఇప్పుడా డెడ్‌లైన్ ముగుస్తోంది. ప్రస్తుతం అప్ఘానిస్తాన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు తెగబడేలా కనిపిస్తోంది. డెడ్ లైన్ ముగిసేనాటికి అమెరికా తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇప్పటికే తాలిబన్లు హెచ్చరించారు. ఒక్కో రోజు దాటినా తాలిబన్లు అన్నంత పనిచేసేలా చేసేలా ఉన్నారు. కానీ, ఇప్పటికీ అమెరికా తమ దేశస్థుల తరలింపు పూర్తి కాలేదు. మరోవైపు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 31లోగా తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. గడువును పొడగించాలని బ్రిటన్ సహా పలు దేశాలు కోరుతున్నాయి.. అయినా బైడెన్ ససేమిరా అంటున్నారు. తాలిబన్లు కూడా డెడ్ లైన్ దాటితే దాడులే అన్నట్టుగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తరలింపు ప్రక్రియను అమెరికా వేగతవంతం చేసింది. అమెరికా అప్ఘాన్ నుంచి నిష్క్రమిస్తే మిగతా దేశాలకు తరలింపు ప్రక్రియ అసాధ్యంగా మారనుంది. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అమెరికా,నాటో దళాల నియంత్రణలో ఉంది. అందుకే తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లనున్నాయి.
Afghanistan : కాబూల్ రాకెట్ దాడిలో ఆరుగురు మృతి..అమెరికా వైమానిక దాడి!

అంతేకాదు.. సంక్షోభ సమయంలో అప్ఘాన్ పౌరులు చేజిక్కించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఆయుధాలు, వాహనాలను తిరిగి తమకు అప్పగించాలని తాలిబన్లు పౌరులకు డెడ్ లైన్ విధించారు కూడా. అవన్నీ తమకు అప్పగించని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బలగాల పొడిగింపునకు తాము అనుమతించబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ స్పష్టం చేశారు. జాప్యం చేయరాదని.. డెడ్ లైన్ క్రాస్ చేసిన పక్షంలో జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తాలిబన్ల చేతుల్లో అప్ఘాన్ వెళ్లిపోయింది. ఇప్పుడీ ఈ దేశం తాలిబన్ల రాజ్యం.. ఇప్పటికీ ఈ దేశాన్ని మీ ఆధీనంలోనే ఉంచుకుంటే ప్రతీకార చర్యలకు దిగక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 31 లోగా మీ సైనికులను పూర్తిగా ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చెప్పారని అన్నారు.

కానీ, అప్ఘానిస్తా‌న్‌లో తమ దేశస్థుల తరలింపు పూర్తిగా జరగాల్సి ఉందన్నారు. అందుకే బలగాల ఉపసంహరణను మరికొంత కాలం పొడిగించే అవకాశాలున్నాయని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని ఇటీవలే బైడెన్ పేర్కొన్నారు. మరోవైపు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా డెడ్ లైన్ పొడిగించడమే ఉత్తమమని కోరుతున్నారు. జీ-7 సమ్మిట్ లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తానని ఆయన చెబుతున్నారు. రెండు అగ్ర దేశాలూ సరేనన్నా.. తాలిబన్లు మాత్రం ఈ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఆప్ఘన్ ప్రజలు తీసుకున్న ప్రభుత్వ ఆస్తులు, వాహనాలు, ఆయుధాలను తిరిగి సంబంధిత శాఖలకు, ఆఫీసులకు అప్పగించాలని తాలిబన్లు అప్ఘాన్ పౌరులకు పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంలో తాలిబన్లకు ఆయుధాలు, వాహనాలను ఎంతవరకు జనం అప్పగిస్తారనేది ఉత్కంఠ నెలకొంది.

డెడ్‌లైన్ రేపటితో ముగియనుంది. ఈలోగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదాలు రెచ్చిపోయారు. సోమవారం(ఆగస్టు 30) విమానాశ్రయంపై మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. ఖొర్షిద్ ప్రైవేట్ యూనివర్సిటీ సమీపంలో వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. అయితే అమెరికా భద్రతా దళాలు ఈ ఉగ్రదాడులను తిప్పికొట్టాయి.
Syed Ahmad Shah Saadat : ఒకప్పుడు అప్ఘాన్ మంత్రి.. ఇప్పుడేమో పిజ్జా డెలివరీ బాయ్‌..!