Afghanistan : కాబూల్ రాకెట్ దాడిలో ఆరుగురు మృతి..అమెరికా వైమానిక దాడి!

అప్ఘానిస్తాన్​ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.

Afghanistan : కాబూల్ రాకెట్ దాడిలో ఆరుగురు మృతి..అమెరికా వైమానిక దాడి!

Kabul (1)

Afghanistan అప్ఘానిస్తాన్​ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని గులై ఏరియాలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు సమాచారం. మరణించినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక,ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

స్థానిక వార్తా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం మధ్యాహ్నాం ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఓ ఇంటిపై..ఒక రాకెట్ కూలిపోయి పేలుడు సంభవించింది. కాగా కాబుల్​లో ఉగ్రదాదులు మరోసారి దాడి చేస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. అయితే ఈ దాడి వెనుక ఐసిస్ హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు.

ఇక,కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద గురవారం ఐసిస్​-కే జరిపిన జంట ఆత్మాహుతి దాడుల్లో 160కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13మంది అమెరికా సైనికులు ఉన్నారు. కాబుల్​లో​ నాలుగు రోజుల వ్యవధిలో మూడు పేలుళ్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు, కాబుల్​లోనే అమెరికా ఆదివారం వైమానిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కాబుల్​ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు వెళ్తున్న ఓ ఉగ్రవాది వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం ఈ దాడి జరిపినట్లు సమాచారం.అయితే కాబుల్​ సమీపంలో జరిగిన రాకెట్ దాడి, అమెరికా వైమానిక దాడి ఘటనలు వేరు వేరు అని తెలుస్తున్నప్పటికీ.. వీటిపై పూర్తిస్థాయిలో సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.