Kim Jong Un : భారీగా బరువు తగ్గిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. ఈ ఫోటోలు అతనివే

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ సైనిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా జాతీయ మీడియా ప్రసారం చేసింది. ప్రస్తుతం కిమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Kim Jong Un : భారీగా బరువు తగ్గిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. ఈ ఫోటోలు అతనివే

Kim Jong Un

Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించరు. ఎదో అకేషన్ ఉంటేగాని ఆ దేశ ప్రజలకు కూడా దర్శనం ఇవ్వరు. చాలా కాలం కిమ్ కనిపించకపోవడంతో ఆయన ఇకలేరేమో అనుకున్నారు చాలామంది. అయితే ఈ నేపథ్యంలోనే మే నెలలో తళుక్కున మెరిసి తనకేం కాలేదు ఆరోగ్యాంగా ఉన్నానని చెప్పారు. పొరుగు దేశాలు తన ఆరోగ్యంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇక తాజాగా మరోసారి బయటకు వచ్చారు కిమ్. తాజాగా ఉత్తర కొరియాలో జరిగిన సైనిక కవాతులో పాల్గొన్నారు కిమ్.. ఈ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా జాతీయ మీడియా ప్రసారం చేసింది.

Kim

ఈ కార్యక్రమానికి సూట్ లో వచ్చారు కిమ్.. గంటపాటు సైనిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అధునాతన ఆయుధాలను ప్రయోగించలేదు. అయితే ఫొటోల్లో కాస్త చిక్కినట్లు కనిపించారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల నివేదిక ప్రకారం కిమ్ 140 కిలోల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆయన బరువు చాలా తగ్గినట్లు ఫొటోల్లో చూస్తే అర్ధమవుతోంది. 2011 లో ఉత్తర కొరియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కిమ్ ప్రతి ఏడాది 6 నుంచి 7 కేజీలు పెరుగుతూ వచ్చారని దక్షిణ కొరియా పేర్కొంది. అయితే ఈ ఏడాది జూన్ నుంచి ఆయన బరువు తగ్గుతున్నారని తెలిపింది.

Kim (2)

ఇక ఈ కార్యక్రమంలో కిమ్ ప్రసంగించలేదు.. కేవలం సైనిక కార్యక్రమం వీక్షించి వెళ్లారు. ఇద్దరు పిల్లలు ఆయనను స్వాగతించిన దృశ్యాల్లో నవ్వుతూ ముందుకుసాగారు. కిమ్‌… సుమారు 20కిలోలు బరువు తగ్గినట్లు దక్షిణ కొరియా శాసనసభ్యుడు ఒకరు జులైలో చెప్పగా.. ఇప్పుడు మరింత సన్నగా కనిపించి ఆకట్టుకున్నారు.