North Korea: ‘తీవ్ర ప‌రిణామాలు ఉంటాయి’.. అమెరికా, ద‌క్షిణ‌కొరియాకు ఉత్త‌ర‌కొరియా వార్నింగ్

అమెరికా, ద‌క్షిణ‌ కొరియాకు ఉత్త‌ర‌ కొరియా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ద‌క్షిణ కొరియా సంయుక్త సైనిక‌ విన్యాసాలను కొన‌సాగిస్తూ, త‌మ దేశ‌ ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తూ మిల‌ట‌రీ ప‌రంగా ఒత్తిడి పెంచితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రించింది.

North Korea: ‘తీవ్ర ప‌రిణామాలు ఉంటాయి’.. అమెరికా, ద‌క్షిణ‌కొరియాకు ఉత్త‌ర‌కొరియా వార్నింగ్

North Korea

North Korea: అమెరికా, ద‌క్షిణ‌ కొరియాకు ఉత్త‌ర‌ కొరియా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ద‌క్షిణ కొరియా సంయుక్త సైనిక‌ విన్యాసాలను కొన‌సాగిస్తూ, త‌మ దేశ‌ ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తూ మిల‌ట‌రీ ప‌రంగా ఒత్తిడి పెంచితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రించింది. ఉత్త‌రకొరియాపై దాడి చేసే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని అమెరికా, ద‌క్షిణ‌కొరియా చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ, ఉత్త‌ర‌కొరియా మాత్రం ఆ ఇరు దేశాల చ‌ర్య‌ల‌పై మండిప‌డుతోంది. ఉత్త‌ర‌కొరియా ఈ ఏడాది వ‌రుస‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తున్న నేప‌థ్యంలో అమెరికా, ద‌క్షిణ కొరియా మ‌రోసారి త‌మ సైనికుల‌కు సంయుక్తంగా శిక్షణ ఇవ్వాల‌ని భావిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌కొరియా తాజాగా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ద‌క్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు కొరియా ద్వీపకల్పంలో యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉన్నాయ‌ని చెప్పింది. వ‌చ్చే నెల మ‌రోసారి సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని తెలిపింది. ఉత్త‌ర‌కొరియా నుంచి పొంచి ఉన్న అణు ముప్పును ఎదుర్కోవ‌డానికి తాము ద‌క్షిణ కొరియాతో సంయుక్త విన్యాసాలు చేస్తామ‌ని ఈ ఏడాది మేలోనే అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో కొరియా ద్వీప‌క‌ల్పంలో ఈ అంశం మ‌రోసారి క‌ల‌క‌లం రేపే అవ‌కాశం ఉంది.

YouTube: అబార్ష‌న్లు చేసే ప్ర‌క్రియ‌పై త‌ప్పుడు స‌మాచారంతో వీడియోలు.. యూట్యూబ్ చ‌ర్య‌లు