ట్రంప్ చెబితే మాత్రం ఆ వ్యాక్సిన్ తీసుకోను: కమలాహారిస్

ట్రంప్ చెబితే మాత్రం ఆ వ్యాక్సిన్ తీసుకోను: కమలాహారిస్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ Mike Pence, డెమొక్రటిక్ ఛాలెంజర్ Kamala Harrisల మధ్య చర్చ వాడీవేడీగా జరిగింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ Covid మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో విఫలం అయ్యారంటూ బుధవారం డిబేట్ లో కమలా అన్నారు. మహమ్మారి ఎఫెక్ట్‌కు వైట్ హౌజ్‌లో డజన్లకొద్దీ మనుషులు అనారోగ్యానికి గురైనట్లు ఆరోపించారు.

ట్రంప్, డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ నామినీ జో బిడెన్ మధ్య చర్చలకు కొనసాగింపుగా ఈ చర్చ జరిగింది. ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి కానీ, ముగింపుకు రాలేదు.



హారిస్ వారి పార్టీకి చెందిన వ్యక్తి.. అటాకింగ్ రోల్‌ను కొనసాగించారు. హెల్త్ కేర్, ఎకానమీ పైన ట్రంప్ రికార్డును, వాతావరణ మార్పులు, విదేశీ పాలసీలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ ను పెన్స్ డిఫెండ్ చేసుకుంటూ.. వస్తున్నారని నాలుగేళ్ల రికార్డును గుర్తు చేశారు.

పెన్స్ చైనాను బ్లేమ్ చేస్తూ.. మహమ్మారి యూఎస్ అడ్మినిస్ట్రేషన్ ను దెబ్బతీసింది. జబ్బుతో పోరాడుతూనే ఉన్నాం. ఇందులో భాగంగానే జనవరి నుంచి చైనాకు వెళ్లడాన్ని పూర్తిగా నిషేదిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.

మాడ‌రేట‌ర్.. క‌మ‌లా హారిస్‌ను ప్రశ్నించారు. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌చ్చింద‌ని, ఆ వ్యాక్సిన్ తీసుకోవాలని ట్రంప్ చెబితే, ఆ టీకాను వేసుకుంటారా అని అడగ్గా.. క‌మ‌లా .. ఒక‌వేళ డాక్ట‌ర్లు లేదా ప‌బ్లిక్ హెల్త్ అధికారులు చెబితే, క‌చ్చితంగా టీకా వేసుకుంటా. ముందువ‌ర‌స‌లో నేనే ఉంటా అని ఆమె అన్నారు. ఒక‌వేళ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ట్రంప్ చెబితే మాత్రం.. ఆ టీకాను తీసుకోనని క‌మ‌లా హారిస్ సమాధానమిచ్చారు.

పెన్స్.. కమలా వ్యాఖ్యలను ఖండిస్తూ.. వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ రికార్డు వేగంతో జ‌రుగుతున్నాయ‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాల‌తో రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని ఆమెతో అన్నారు. టీకా డోసుల ఉత్ప‌త్తి మిలియ‌న్ల సంఖ్య‌లో జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. సాల్ట్ లేక్ సిటీలోని యూనివ‌ర్సిటీ ఆప్ ఉటావ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య 90 నిమిషాల పాటు చ‌ర్చ కొనసాగింది.