Omicron Fear : అమెరికా, యూకేలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్

అమెరికా, బ్రిటన్ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. న్యూయార్క్ నగరంలో రోజుకు 22వేల కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.

Omicron Fear : అమెరికా, యూకేలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్

America Omicron

Omicron Fear :  అమెరికా, బ్రిటన్ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్  వణికిస్తోంది.  న్యూయార్క్ నగరంలో రోజుకు 22వేల కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ రకమే కారణమని అనుమానిస్తోంది ప్రభుత్వం. మరో వైపు బ్రిటన్‌లోనూ ఒమిక్రాన్ రకం కోవిడ్-19 కేసులు పెరుగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రోజుకు 90 వేలకు పైగా కోవిడ్-19 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం గుర్తించని ఒమిక్రాన్ కేసులు వేలు, లక్షల్లో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఆస్పత్రుల్లో రోజుకు 3,000 మంది చేరుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.
Also Read : Three Children Drowned : స్వర్ణముఖి నదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతు
ఆంక్షలు, నిషేధాజ్ఞల దిశగా బ్రిటన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్రిస్మస్ తర్వాత ఇండోర్ పార్టీలు, సమావేశాలు నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.