Omicron Threat : కరోనా బారిన పడినవారికి..ఒమిక్రాన్ సోకదనుకుంటే పొరపాటే : పరిశోధకుల వార్నింగ్
గతంలో కరోనా బారిన పడినవారికి..ఒమిక్రాన్ సోకదనుకుంటే పొరపాటేనని అటువంటి అపోహలను పక్కన పెట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పరిశోధకులు స్పష్టం చేశారు.

Omicron Threat (1)
Omicron Threat : గతంలో కరోనా బారిన పడ్డవారికి ..ఒమిక్రాన్ వేరియంట్ సోకదని అపోహలు వస్తున్న క్రమంలో అటువంటి అపోహలు పక్కన పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో కరోనా సోకినవారికి కూడా ఒమిక్రాన్ ప్రమాదం తప్పదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. గతంలో కరోనా సోకినా ఒమిక్రాన్‌తో ముప్పుతప్పదని..మునుపటి ఇన్‌ఫెక్షన్ తాలూకు రక్షణ వ్యవస్థను కూడా ఒమిక్రాన్ వేరియంట్ బురిడీ కొట్టిస్తుంది..అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఈ అధ్యయనం హెచ్చరించింది.
Read more : Omicron In 38 Countries : 38 దేశాలకు పాకిన ఒమిక్రాన్..!జట్ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తోంది..!!
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో విట్‌వాటర్స్‌రాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పలు కోణాల్లో అధ్యయనాన్ని నిర్వహించారు. గతంలో కరోనా బారిన పడ్డవారికి.. డెల్టా సహా ఇతర వేరియంట్లు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు. మునుపటి ఇన్ఫెక్షన్తో ఏర్పడిన రక్షణ వ్యవస్థను ఒమిక్రాన్ బురిడీ కొట్టించే అవకాశాలు ఉన్నాయని కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి అని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు.
మునుపటి ఇన్ఫెక్షన్తో ఏర్పడిన రక్షణ వ్యవస్థను ఒమిక్రాన్ తప్పుదోవ పట్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తేలిందని వివరించారు పరిశోధకులు. కాగా ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలకు వ్యాపించి గుబులు పుట్టిస్తోంది.