ఏమోసార్..నాకు వినబడదు : 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి చెవుడు

ఏమోసార్..నాకు వినబడదు : 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి చెవుడు

hearing problem by 2050 : WHO..వినికిడి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంటువ్యాధులు, శబ్దకాలుష్యమే అంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. బుధవారం (మార్చి 3,2021) ‘వరల్డ్‌ హియరింగ్‌ డే’ను సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చెవుడుకు సంబంధించిన అంశాలపై ఒక నివేదిక విడుదల చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

చెవుడుకు కారణాలు అనేకం ఉన్నాయి. కొంతమందికి పుట్టుకతోనే వినికిడి సమస్యలు ఉంటాయి. మరికొందరికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో వినికిడి సమస్యలు వస్తుంటాయి. కానీ వినికిడి సమస్యల నియంత్రణకు సరైన కార్యక్రమాలు చేపట్టకపోవడం..తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది డబ్ల్యూహెచ్వో.

వినికిడి లోపాల నివారణకు జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలని..పలు అవగామన కార్యక్రమాలు చేపట్టాలని world hearing day సందర్భంగా పిలుపునిచ్చింది. వినికిడి లోపం వల్ల పరస్పర సంభాషణ జరగదు. ఎవరైనా చెప్పేది వినిపించదు. దీంతో పలు సమస్యలు తలెత్తుతుంటాయి. పైగా విద్య, ఉపాధికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వారి కుటుంబాల మీద కూడా ప్రభావం చూపించవచ్చు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 18 మందిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి వినికిడి లోపం (ఏదో ఒక స్థాయిలో… అంటే ఓ మోస్తరు నుంచి తీవ్రమైన వినికిడి సమస్యలు) ఉన్నవారి సంఖ్య 250 కోట్లకు పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తూ..ఆందోళన వ్యక్తం చేసింది. అందులో 70 కోట్ల మందికి తప్పనిసరిగా ఏదో రకమైన పరికరం (వినిపించటానికి ఉపయోగపడే యత్రం), తప్పనిసరి అవుతుంది. ఈ సందర్భంగా చెవుడును ప్రజారోగ్య సమస్యగా గుర్తించాలని స్పష్టం చేసింది.

శబ్ద కాలుష్యంతో వినికిడి లోపాలు..
చిన్నతనంలో వైరస్, బ్యాక్టీరియా వంటి వాటివల్ల చెవుడు వస్తుంది. బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. దీంతో పూర్తిగా వినికిడి లోపాలు తలెత్తుతాయి అవి రాను రాను పూర్తిగా వినికిడి లోపం వస్తుంది. రూబెల్లా, మెదడు వాపునకు వ్యాక్సిన్‌ వేయడం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్యలను 60 శాతం తగ్గించొచ్చు. అలాగే చీముతో వచ్చే ఇన్‌ఫెక్షన్లను స్టాటింగ్ లోనే గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేదంటే..వారిలో వినికిడి సమస్యలు పెరుగుతాయి.

వినికిడి సమస్య నియంత్రణ కోసం జాగ్రత్తలు..
వినికిడి సమస్యలు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, టీవీల్లో, మ్యూజిక్‌ సిస్టమ్స్‌లలో అలాగే ఇయర్‌ఫోన్స్‌లో వాల్యూమ్‌ను చాలా తక్కువగా పెట్టుకోవటం వంటివి చేయాలి. అలాగే చెవులను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వినికిడి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.

ఈఎన్‌టీ డాక్టర్‌స్ కొరత..10 లక్షల జనాభాకు ఒకరే ఈఎన్ టీ స్పెషలిస్ట్
వినికిడి లోపం మనకు మాటలు వినిపించకపోవటం ఒక్కటే సమస్య కాదు. దీని వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. చెవుడు వల్ల వృత్తిపరం సమస్యలు వస్తాయి. అలాగే వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. చెవుడు ఉన్నవారు సమాజంలో వివక్షలకు గురవుతుంటారు. వాళ్లను ‘సౌండ్ ఇంజనీర్’ అని వెటకారంగా పిలుస్తుంటారు. దీంతో సదరు వ్యక్తులు మానసికంగా బాధపడుతుంటారు.

తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈఎన్‌టీ డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 78 శాతం పేదదేశాల్లో 10 లక్షల జనాభాకు ఒక్క ఈఎన్‌టీ డాక్టర్‌ కూడా లేరట. ఆడియాలజిస్ట్‌ (వినికిడి పరీక్షించేవారు), స్పీచ్‌ థెరపిస్ట్‌లు ఇంకా తక్కువ ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC)ల్లో వినికిడి సమస్యలకు చికిత్స జరగానీ..జనాభాలో ఎంతమందికి వినికిడి సమస్య ఉందో లెక్క తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని సూచించిది. ఆరోగ్య పథకంలో వినికిడి సంబంధిత వ్యాధులను చేర్చాలని కూడా WHO సూచించింది.