కొత్త వైరస్‌తో వణికిపోతున్న యూకే.. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన గవర్నమెంట్

కొత్త వైరస్‌తో వణికిపోతున్న యూకే.. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన గవర్నమెంట్

యూకే నుంచి బెల్జియం, నెదర్లాండ్స్‌కు వెళ్లనున్న విమానాలను ఆదివారం రద్దు చేశారు. ఆ దేశంలో గతంలో మాదిరిగా వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిని యూకే అధికారులు అవుట్ ఆఫ్ కంట్రోల్ గా పరిగణించాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన వ్యాక్సిన్లు దీని కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కొత్త కేసులు నమోదవుతూ భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై మానిటరింగ్ చేసేందుకు అర్జెంట్ మీటింగ్ కు పిలుపునిచ్చింది. సోమవారం జరగనున్న మీటింగ్ లో వీటిపై చర్చ జరుగుతుంది. యూకేలో కరోనావైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ రేట్ పెరిగిపోయింది. యూరోపియన్ దేశాలు ముందుజాగ్రత్త చర్యగా తమ దేశ సరిహద్దులను క్లోజ్ చేసేశాయి. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి బ్రిటిష్ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాంకాక్ ఈ మేర ఆదివారం ప్రకటించారు.

గవర్నమెంట్ క్రిస్టమస్ లాక్‌డౌన్‌ను అమలుచేయనుంది. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లో కరోనా వైరస్ విపరీతంగా పెరిగిపోయింది. దీనిని అవుట్ ఆఫ్ కంట్రోల్ గా భావిస్తున్నామని తెలియజేశారు.

ఇంగ్లాండ్ లో మూడో వంతు జనాభా కరోనాకు ఎఫెక్ట్ అయ్యారని.. అందుకే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ హ్యాంకాక్ వార్నింగ్ ఇచ్చారు. వైరస్ ను తరిమికొట్టడానికి వ్యాక్సిన్ వచ్చేవరకూ సొల్యూషన్ దొరకదంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘మేం చాలా వేగంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాం’ అని హ్యాంకాక్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘స్టే ఎట్ హోమ్’ అనే పాలసీని ఫాలో అవ్వాలని కుటుంబాలు మీట్ అయి సెలబ్రేట్ చేసుకోవడాన్ని నిషేదించినట్లు చెప్పారు.

‘దురదృష్టవశాత్తు కొత్తగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా చేయి దాటిపోయింది. దీనిని తప్పక దారిలోకి తెచ్చుకోవాలి’ అని అధికారులు అంటున్నారు.

ఇంగ్లాండ్ లో పెట్టిన కొత్త నిబంధనలు శనివారం రాత్రి నుంచి ఎఫెక్ట్ లోకి వస్తాయని.. రాజధాని ప్రాంతంలో ఉన్న వారంతా క్వారంటైన్ లో ఉండాలని మిగిలిన ప్రాంతాల వారితో కలవకూడదని చెప్పారు. మార్చిలో మొదలైన తొలి లాక్‌డౌన్ మాదిరిగా మరోసారి కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నారు. శనివారం రాత్రి నుంచి గుంపులుగుంపులుగా సిటీ వదిలివెళ్లిపోవడానికి రైల్వేస్టేషన్లలో గుమిగూడారు జనాలు. వీరిని అదుపుచేయడానికి ట్రాన్స్ పోర్ట్ అధికారులు మరింతమంది సిబ్బందిని పెంచాలని రైల్వే స్టేషన్లలో జాగ్రత్తలు పెంచాలని అంటున్నారు.

బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు నో ఎంట్రీ చెప్తున్నాం. ఈ మేరకు జనవరి 1వరకూ నెదర్లాండ్స్ కు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నాం. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలన్నింటినీ నిషేదించాం. ఆదివారం అర్ధరాత్రి బయల్దేరిన కార్గో విమానాలను మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. నెదర్లాండ్స్ తో పాటు ఫ్రాన్స్ కూడా యూకే నుంచి వచ్చే విమానాలకు నో చెప్పేసింది. ప్రాథమికంగా 48గంటల పాటు నిషేదం అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

బెల్జియం 24గంటల పాటు బ్రిటన్ నుంచి విమానాలకు నిషేదం ప్రకటించింది. ఆస్ట్రియా, ఇటలీలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. లండన్, బ్రస్సెల్, ఆంస్టర్ డ్యామ్ నుంచి బయల్దేరాల్సి ఉన్న రైళ్ల రాకపోకలను కూడా సోమవారం వరకూ ఆపేశారు.