Tipu Sultan ‘victory’ Painting : టిప్పు సుల్తాన్ ‘విజయ’కేతనం చిత్రం ధర రూ. 6.27 కోట్లు..!
1780లో ఈస్టిండియా కంపెనీపై హైదర్ అలీ, అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ సాధించిన విజయానికి గుర్తుగా ఆనాడు వేసిన చిత్రాలకు మంచి ధర పలికింది.

Tipu Sultan's Historic Victory Painting Rs. 6.27 Crore (2)
Tipu Sultan’s Historic Victory Painting Rs. 6.27 Crore : 1780లో ఈస్టిండియా కంపెనీపై హైదర్ అలీ, అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ సాధించిన విజయానికి గుర్తుగా ఆనాడు వేసిన చిత్రాలకు మంచి ధర పలికింది. 242 సంవత్సరాల క్రితం సెప్టెంబరు 10న ఆంగ్లో-మైసూరు యుద్ధం జరిగింది. దీనినే ‘ది బ్యాటిల్ ఆఫ్ పొల్లిలూర్’గా అంటారు. ఈ యుద్ధంలో సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోయేలా టిప్పు సుల్తాన్ ఓ పెయింటింగ్ గీయించారు. ఆ పెయింటింగ్ ను వేలం వేయగా అద్దిరిపోయే ధర పలికింది.
32 అడగుల పొడవున్న ఈ పెయింటింగ్‌ను లండన్‌లోని సదబీస్ ఆక్షన్ హౌస్‌లో వేలానికి ఉంచారు. వరల్డ్ అండ్ ఇండియా విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రాలు ఏకంగా రూ. 6.27 కోట్లకు (6.30 లక్షల పౌండ్లు) అమ్ముడుపోయాయి.
ఈ పెయింటింగ్ లో యుద్ధం యొక్క దృశ్యాలకు కళ్లకు కట్టినట్లుగా వేసారు. ఇది నిస్సందేహంగా మనుగడలో ఉన్న వలసవాద ఓటమికి సంబంధించిన గొప్ప భారతీయ చిత్రం. ఇది అద్వితీయమైన మరియు అద్భుతమైన కళాకృతి” అని సోథెబీస్ నిపుణుడు విలియం డాల్రింపుల్, ‘ది అనార్కీ: ది రిలెంట్‌లెస్ రైజ్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ’ రచయిత అన్నారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుర్కొన్న అత్యంత ప్రభావవంతమైన ప్రత్యర్థి టిప్పు సుల్తాన్. టిప్పు భారతీయులు తిరిగి పోరాడగలరని, భారతదేశంలో యూరోపియన్ సైన్యాన్ని ఓడించడం మొదటిసారిగా ఈ పొల్లిలూర్ యుద్ధంలో విజయం సాధించగలదని చూపించాడు అని అన్నారు. రు.