UAE Kashmir Map: దేశం బయట ఇదే తొలిసారి.. పీఓకే భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌ విడుదల చేసిన యూఏఈ

ఇది భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించింది. అయితే ఇందులో ఆసక్తికరంగా, కశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగమని చూయించారు. పీఓకే, అక్సాయ్ చిన్ లు ఇండియాలో భాగంగా ఉన్నాయి.

UAE Kashmir Map: దేశం బయట ఇదే తొలిసారి.. పీఓకే భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌ విడుదల చేసిన యూఏఈ

Updated On : September 15, 2023 / 3:47 PM IST

POK in India: కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్‌కు మిత్ర దేశాల నుంచి కూడా మద్దతు లభించడం లేదు. నిజానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని పాకిస్థాన్‌కు సన్నిహితంగా ఉండే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం అంగీకరించింది. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్వయంగా వెల్లడించిన తాజా మ్యాప్ ఇందుకు ఉదాహరణ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగంగా ప్రకటించి పాక్ కు దెబ్బ కొట్టింది.

Elon Musk: అంబర్ హర్డ్‭తో డేటింగ్, మాజీ భార్యతో రహస్యంగా 10వ బిడ్డ.. ఎలాన్ మస్క్ జీవితంలోని సంచలన రహస్యాల్ని బయటపెట్టిన జీవిత చరిత్ర!

యూఏఈ ఉప ప్రధాన మంత్రి సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ న్యూఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించింది. అయితే ఇందులో ఆసక్తికరంగా, కశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగమని చూయించారు. పీఓకే, అక్సాయ్ చిన్ లు ఇండియాలో భాగంగా ఉన్నాయి.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో భాగమని భారత్ ఎప్పటి నుంచో చెప్తోంది. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీఓకే భారతదేశంలో భాగమని అలాగే ఉంటుందని అన్నారు. ఒక మరొకవైపు పీఓకే తమదేనని పాకిస్థాన్ ప్రభుత్వం సైతం చెబుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యూఏఈ వంటి ఇస్లామిక్ దేశం నుంచి భారత్‌కు మద్దతు లభించడం గమనార్హం. అయితే పాకిస్థాన్‌కు మాత్రం ఇది ఒక రకమైన షాక్‌. ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రారంభించారు. ఈ ఒప్పందం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ లేసింది. సౌదీ అరేబియా, అమెరికా కూడా ఈ డీల్‌లో ఉన్నాయి. దీనిని రష్యా కూడా మెచ్చుకుంది.

Putin and Kim: బాబోయ్, పలకరింపు మరీ ఇంత వైలెంటుగానా? తుపాకులతో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న పుతిన్, కిమ్ జోంగ్

యూఏఈలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కశ్మీర్‌లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. వాస్తవానికి, దుబాయ్‌కి చెందిన యూఏఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన ఎమ్మార్ శ్రీనగర్‌లో మాల్‌ను నిర్మించే కాంట్రాక్ట్‌ను గెలుచుకుంది. ఈ మాల్‌ను 10 లక్షల చదరపు కిలోమీటర్లలో నిర్మిస్తున్నారు.