పాకిస్థాన్ మదర్సాల్లో తలలు ఎలా తెగ నరకాలో బాలికలకు ట్రైనింగ్

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 10:58 AM IST
పాకిస్థాన్ మదర్సాల్లో తలలు ఎలా తెగ నరకాలో బాలికలకు ట్రైనింగ్

Pakistan training how to behead : పాకిస్థాన్ లో చిన్నారులకు మారణకాండ ఎలా చేయాలో నేర్పుతున్నారు. ఫ్రాన్స్ లో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఓ పత్రికలో వచ్చిన కార్టూన్ పై ముస్లిం దేశమైన పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ఫ్రెంచ్ పత్రికపై పాకిస్థాన్ లో తీవ్ర నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈక్రమంలో పాకిస్థాన్ మదర్సాల్లో తలలు ఎలా తెగనరకాలి? అనేదానిపై ప్రత్యేక శిక్షణనిస్తున్న ఘటనల గురించి తెలిస్తే ఒళ్లు గగొర్పొడుస్తుంది.


ఫ్రాన్స్ లో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఓ పత్రికలో కార్టూన్లు పునర్ ముద్రణ కావడం ముస్లిం దేశమైన పాకిస్థాన్ ను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఫ్రెంచ్ పత్రిక వైఖరిపై పాక్ లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనలు తెలియజేయటం ప్రతీ ఒక్కరి హక్కు. కానీ అంతకంటే దారుణమైన పనులు చేస్తోంది పాక్. పాక్ లోని మదర్సాల్లో అంటే మత సంస్థలు మరో అడుగు ముందుకేసి తలలు తెగ్గోయడంలో బాలికలు, యువతులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నాయి..!!


పాక్ లోని చాలా వరకూ మదరసాల్లో ఇటువంటి ట్రైనింగ్ శిబిరాలు కొనసాగుతున్నాయి. పదునైన కత్తితో మనిషి మెడను కోయడం ఎలా? ఎలా నరికితే..ఎంత ఫోర్స్ గా నరికితే తల తెగిపడుతుంది? అనే కీలకమైన విషయాలపై మెళకువలు నేర్పిస్తున్నాయి మదర్సాలు.


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దిష్టిబొమ్మ తయారుచేయించి ఆ బొమ్మ పీక కోయడంపై ప్రాక్టీసు చేయిస్తున్నారు. అంతేకాదు..మమహ్మద్ ప్రవక్తను అవమానించినవారి తలలు తెగ్గోయాలంటూ బాలికలు..యువతులతో నినాదాలు కూడా చేయిస్తున్నారు.


ఈ తలలు తెగనరకటం ఎలా అనేదానిపై ట్రైనింగ్ పొందుతున్నవారిలో ఓ యువతి మాట్లాడుతూ..‘‘ మహ్మద్ ప్రవక్తను అవహేళన చేసే వారిపై ప్రతీకారం మా రక్తాన్ని చిందిస్తాం..తీర్చుకోవటానికి మా ప్రాణాల్ని కూడా లెక్కచేయం..’’అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తెలిపింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు పాకిస్థాన్ ఎంతటి నరమేధాన్ని బాలికలను వాడుకుంటోందో తెలియజేయటానికి.


దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోల ద్వారా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేయటమే ఉద్ధేశంగా తెలుస్తోంది.