SCO Meeting: ఢిల్లీలో జరుగుతున్న రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న పాకిస్తాన్

లధాఖ్ ప్రాంతంలో వివాదాస్పద సరిహద్దు వెంబడి 3 సంవత్సరాల నాటి ప్రతిష్టంభనను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తావిస్తూ, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒడిదుడులకు గురయ్యాయని, వాటికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలని పేర్కొంది.

SCO Meeting: ఢిల్లీలో జరుగుతున్న రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న పాకిస్తాన్

SCO meeting in India

SCO Meeting: భారత రక్షణ మంత్రి రాజ్‭నాథ్ సింగ్ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‭సీఓ) సమావేశం ప్రారంభమైంది. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉబ్జెకిస్తాన్ దేశాల రక్షణ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సభ్య దేశాలే కాకుండా ఈసారి జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు బెలారస్, ఇరాన్ దేశాలను పరిశీలక దేశాలుగా భారత్ ఆహ్వానించింది. అయితే ఈ సమావేశానికి పాకిస్తాన్ కూడా హాజరుకానుంది. అయితే అది ప్రత్యక్షంగా కాదు. వర్చువల్ ద్వారా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ప్రసంగించనున్నారు.

Karnataka Polls: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరాల జల్లు

ఇక 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణల తర్వాత చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగిన కొద్దిసేపటికే, భారత్‌తో ఉద్రిక్తమైన, ఎత్తైన సరిహద్దులో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని చైనా రక్షణ మంత్రి లి షుంగ్ఫు అన్నారు. “చైనా, భారత్ దేశాల మధ్య విభేదాల చాలా తక్కువ. ఇరు దేశాల మధ్య సాధారణ ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి” అని లీ తన రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశంలో ఉటంకించారు. “దీర్ఘకాలిక దృక్పథాన్ని తీసుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యకు పరిష్కారం చూడాలి. వీలైనంత త్వరగా సరిహద్దు పరిస్థితిని సాధారణీకరించడానికి ప్రోత్సహించాలి” అని ఆయన అన్నారు.

Maharashtra Politics: తాను కూడా రాజ్ థాకరేలాగే అన్న అజిత్ పవార్.. కొంపదీసి కొత్త పెడతారా ఏంటి?

ఇదిలావుండగా, లధాఖ్ ప్రాంతంలో వివాదాస్పద సరిహద్దు వెంబడి 3 సంవత్సరాల నాటి ప్రతిష్టంభనను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తావిస్తూ, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒడిదుడులకు గురయ్యాయని, వాటికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలని పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా అన్ని సరిహద్దు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్‭నాథ్ సింగ్ పేర్కొన్నారు.