Karnataka Polls: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరాల జల్లు

హామీలు నెరవేర్చరని కాంగ్రెస్ పార్టీని నరేంద్రమోదీ నిందిస్తున్నారు. మీకు ఇంతకు ముందే ఇచ్చిన నాలుగు హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నెరవేరుస్తానని మాటిస్తున్నాను. మొదటి క్యాబినెట్ మీటింగులోనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది

Karnataka Polls: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరాల జల్లు

Rahul Gandhi

Karnataka Polls: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాని ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా వరుస వరాల జల్లు కురిపిస్తున్న కాంగ్రెస్.. ఐదో హామీ కింద మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రకటన చేసింది. గురువారం రాష్ట్రంలోని ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాలలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చుకోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తిప్పికొట్టారు.

Asaduddin Owaisi: రక్తంతో హోలీ చేసుకున్నారు.. పుల్వామా దాడిపై సత్యపాల్ మాలిక్‭ను తీవ్రంగా దూషించిన ఓవైసీ

‘‘హామీలు నెరవేర్చరని కాంగ్రెస్ పార్టీని నరేంద్రమోదీ నిందిస్తున్నారు. మీకు ఇంతకు ముందే ఇచ్చిన నాలుగు హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నెరవేరుస్తానని మాటిస్తున్నాను. మొదటి క్యాబినెట్ మీటింగులోనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. నాలుగు హామీలు నెరవేర్చమని మోదీ అంటున్నారు. నేనిప్పుడు అంత కంటే ఎక్కువ హామీలు ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం. మోదీజీ జాగ్రత్త వినండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది అమలు అవుతుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Karnataka Polls: ఉన్నట్టుండి మోదీని అంత మాటనేశారేంటి? వివాదాస్పదమైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కామెంట్స్

కాగా, గృహ జ్యోతి పథకం కింద రాష్ట్రంలోని గృహాలన్నింటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహ లక్ష్మీ పథకం కింద మహిళలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం, అన్న భాగ్య పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి 10 కిలోల ఉచిత బియ్యం, యువ నిధి కింద 18 నుంచి 25 ఏళ్ల మధ్య యువతకు డిగ్రీ చదివిన వారికి 3,000 రూపాయలు, డిప్లమా చేసిన వారికి 1,500 రూపాయలకు నెల చొప్పున ఇస్తామని నాలుగు ప్రధాన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేసింది.