Karnataka Polls: ఉన్నట్టుండి మోదీని అంత మాటనేశారేంటి? వివాదాస్పదమైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కామెంట్స్

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు.

Karnataka Polls: ఉన్నట్టుండి మోదీని అంత మాటనేశారేంటి? వివాదాస్పదమైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కామెంట్స్

Mallikarjun Kharge

Karnataka Polls: ప్రధానమంత్రి నరేంద్రమోదీని విషపాము అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తన మాటలను సవరించుకుని ‘భారతీయ జనతా పార్టీ విష సర్పం’ అని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కలబుర్గిలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి.

Jagga Reddy: నాలాంటి వారిని ఎలా వాడుకోవాలో ఇన్‌చార్జిలకు తెలియదు: జగ్గారెడ్డి

‘‘మోదీ విషపాము లాంటివాడు. విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారు. అయితే బయటి నుంచి చూస్తే చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తారు. బాగా మాట్లాడతారు. కానీ ఆయన కడుపునిండా విషమే ఉంటుంది’’ అని ఖర్గే అన్నారు. ఇక వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన వ్యాఖ్యలు మోదీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. ‘‘భారతీయ జనతా పార్టీయే విషసర్పం. ఆ పార్టీని ముట్టుకుంటే చావు తప్పదు. నేను మోదీ గురించి మాట్లాడలేదు. ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయను. వారి భావజాలంపై మాత్రమే విమర్శలు చేస్తాను’’ అని అన్నారు.

Telangana New Secretariat : తెలంగాణ ఖ్యాతి పెంచేలా నూతన సచివాలయం, కేసీఆర్ వల్లే ఇంత భారీ నిర్మాణం సాధ్యం- ప్రశాంత్ రెడ్డి

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు. ఖర్గే అనుచిత వ్యాఖ్యల రగడ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొనసాగేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Asaduddin Owaisi: రక్తంతో హోలీ చేసుకున్నారు.. పుల్వామా దాడిపై సత్యపాల్ మాలిక్‭ను తీవ్రంగా దూషించిన ఓవైసీ

కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. అయితే మోదీని విమర్శించిన ప్రతీసారి కాంగ్రెస నేతలే దెబ్బ తిన్నారు. మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని స్వయంగా సోనియా గాంధీయే విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని మణిశంకర్ అయ్యర్ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. కానీ ఎన్నికల్లో మాత్రం లబ్ది పొందలేకపోయారు.