pakistan : ‘ప్రేమంటే ఇదేరా’..ఇంట్లో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రీమంతురాలు..

చిన్నపని దొరికినా చాలు కష్టపడి పనిచేసి బతికేద్దామని వచ్చిన ఓ వ్యక్తి రొట్టె విరిగి నేతిలో పడింది. పనికోసం వస్తే ఏకంగా ఆ ఇంటి యజమానికే భర్త అయ్యాడు. ఇంట్లో పనిచేసే నౌకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ శ్రీమంతురాలు.

pakistan : ‘ప్రేమంటే ఇదేరా’..ఇంట్లో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రీమంతురాలు..

Islamabad woman marries servant of true love : చిన్నపని దొరికినా చాలు కష్టపడి పనిచేసి బతికేద్దామని వచ్చిన ఓ వ్యక్తి రొట్టె విరిగి నేతిలో పడింది. పనికోసం వస్తే ఏకంగా ఆ ఇంటి యజమానికే భర్త అయ్యాడు. ఎందుకంటే ప్రేమంటే అంతేమరి..ప్రేమంటే ఇదేరా..అనే ప్రేమ కథలు ఎన్నో..ఎన్నెన్నో. అటువంటిదే పాకిస్థాన్ లో జరిగింది. వినటానికి కథలా ఉన్నా..కథకాని కథ..ప్రేమకథ. ఇంటి యజమానురాలికి ఇంటి పనివాడిపై కలిగిన ప్రేమకథ..

ఆమె పేరు నజియా. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఉంటుంది. డబ్బు దండిగా ఉంది. ఇంటిలో నౌకర్లు…చాకర్లను పెట్టుకుని దర్జాగా బతికేంత డబ్బుంది. ఒంటరిగా ఉంటోంది.దీంతో ఇంటి పనుల్లో సాయం కోసం కొంత కాలం క్రితం సుఫియాన అనే వ్యక్తి నియమించుకుంది. నెలకు రూ.18 వేల జీతం ఇస్తోంది. పనికి కుదిరినవాడు పని బాగానే చేస్తున్నాడు. ఏ సమయానికి చేయాల్సిన పని ఆ సమయానికి కచ్చితంగా పర్ ఫెక్ట్ గా చేసేస్తాడు. చాలా సింపుల్ గా ఉంటాడు. చెడు అలవాట్లేమీ లేవు. తన సొంత ఇల్లు, సొంత మనిషి అన్నంత బాగా చూసుకుంటున్నాడు యజమానురాలిని కూడా. అతనిని పరిశీలిస్తున్న నజియాకు ముచ్చటేసింది. చక్కటి వ్యక్తి కుదిరాడు అనుకుంది.

అన్ని పనులు చక్కగా ఒద్దికగా చేస్తున్న సుఫియానను చూసిన నజియాకు ఏదో వింత అభిమానం కలిగేది. అలా అతడిని పరిశీలించి పరిశీలించి అతని సింపుల్ సిటీకి..నిజాయితీకి అతడిపై మనసు పారేసుకుంది. పనివాడు కదా అన్న ఆలోచనే మర్చిపోయింది. ఏదో సొంతమనిషి అనే భావన కలిగేది. అలా సుఫియాన్ తో ఓ రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసింది. అది విన్న సుఫియాన షాక్ అయ్యాడు. తనను పరీక్షించటానికి యజమానురాలు పరాచికాలు ఆడుతోందనుకున్నాడు. ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కానీ నేను చెప్పింది నిజమే..నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది. ఆమె మాటల్లోని నిజాయితీని గమనించిన సుఫియాన మొదటి షాక్ అయినా..తరువాత మీరంటే నాక్కూడా ఇష్టమే అని చెప్పేశాడు. ఇంకేముంది నజియా తెగ ఆనందపడిపోయింది.

ఇంకేం..ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో పని కోసం వచ్చినవాడు.. ఇప్పుడు ఇంటి యజమానురాలికి భర్త అయ్యాడు. నజియా, సుఫియాన్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. సుఫియాన్ నా ‘సల్మాన్ ఖాన్’ అని చెబుతూ నజియా మురిసిపోతే.. నజియా నా ‘కత్రినా కైఫ్’ అంటూ సుఫియాన్ సంబరపడుతున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఓ యూట్యూబ్ చానల్ కంటెంట్ క్రియేటర్ నజియాను ఇంటర్వ్యూ చేయగా వీరి ప్రేమలో జరిగిన ఘట్టాలని చక్కగా ముచ్చటగా వివరించారు ఇద్దరు..

ఈ ఇంటర్వ్యూలో నజియా మాట్లాడుతూ ‘‘నేను ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్పగానే సుఫియాన్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయినంత షాక్ లోకి వెళ్లిపోయాడు. చాలాసేపటికి కోలుకున్నాక..నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడని మురిసిపోతు చెప్పింది. తాను అనారోగ్యం పాలైనప్పుడు దగ్గరుండి అన్ని సేవలు చేశాడని.. వంట చేసి పెట్టడం, మందులివ్వడం వంటివన్నీ చేస్తూ సొంత మనిషి కంటే బాగా చూసుకున్నాడని చెప్పింది. ఎంత డబ్బు ఇస్తే ఇటువంటి మంచి భర్త లభిస్తాడు? అందుకే పనివాడనే ఆలోచనను మర్చిపోయానని నా కోసమే దేవుడే పంపించిన భర్తగా భావించానని చెప్పుకొచ్చింది.
ఇకపోతే యజమానురాలి ప్రేమను చూరగొన్న ‘సల్మాన్ ఖాన్’మాట్లాడుతూ..నేను నజియాకు భర్తనే అయినా.. ఇప్పటికీ, ఎప్పటికీ ఆమెకు సేవ చేస్తూనే ఉంటానని..కంటికి రెప్పలా కాచుకుంటానని చెప్పుకొచ్చాడు.