Groom – Bride in JCB: జేసీబీలో ఊరేగుతూ.. పెళ్లికి విచ్చేసిన పెళ్లికొడుకు – పెళ్లికూతురు

ఓ యువ జంట వినూత్నమైన ఆలోచన చేసింది. పెళ్లికి వచ్చిన వారంతా ఏ లగ్జరీ కారులోనే ఊరేగింపుగా వస్తారని అనుకుంటే జేసీబీలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Groom – Bride in JCB: జేసీబీలో ఊరేగుతూ.. పెళ్లికి విచ్చేసిన పెళ్లికొడుకు – పెళ్లికూతురు

Bride Groom Jcb

Groom – Bride in JCB: జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవడం ఓ గొప్ప అనుభూతి. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు కనీసం కొద్ది రోజుల పాటైన చెప్పుకోవాలని తాపత్రయపడుతుంటారు. అలాగే ప్రయత్నించిన ఓ యువ జంట వినూత్నమైన ఆలోచన చేసింది. పెళ్లికి వచ్చిన వారంతా ఏ లగ్జరీ కారులోనే ఊరేగింపుగా వస్తారని అనుకుంటే జేసీబీలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

పాకిస్తాన్ లో జరిగిన ఈ వేడుకలో అందరూ ఎదురుచూస్తున్నట్లుగా లగ్జరీ కారులో ఊరేగింపుకు బదులు జేసీబీలో రావడం షాకింగ్ కు గురి చేసింది. కొందరు ఈ వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నారు. పాకిస్తాన్ లోని హంజా లోయ ప్రాంతంలో జరిగిన వేడుకకు సంబంధించి 40సెకన్ల వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది.

……………………………………….. : బతుకమ్మ పాటకు ఏఆర్‌ రెహ్మాన్‌ మ్యూజిక్

జేసీబీ మొత్తం పూలతో డెకరేషన్ చేసుకుని వస్తుండగా రోడ్ మీద ఉన్న అతిథులు.. నవ్వులతో కొత్త జంటకు వెల్ కమ్ చెబుతున్నారు. జేసీబీలో వస్తున్న జంట ఆగిపోయాక అతిథుల స్వాగతంతో కిందకు దిగారు.

అసలు విషయం ఏంటంటే.. :
వరుడు ఆ జేసీబీకి డ్రైవర్ గా పనిచేస్తాడట. అతని వృత్తిని గౌరవిస్తూ వధువు జేసీబీలోనే ఊరేగింపుగా వెళ్దామని చెప్పడంతో కాదనకుండా ఇలా చేశాడు. అతని కంటే ఎక్కువ చదువులు చదువుకున్న యువతి అతని వృత్తిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తన భర్తను కూడా అలాగే గౌరవిస్తుందనుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు.