Fish Tongue : చేప నాలుక తినేసి కృత్రిమ నాలుకగా మారిన పరాన్నజీవి

చేపకు నాలుక ఉండాల్సిన స్థానంలో ఓ పరాన్న జీవి తిష్టవేసింది. అసలు నాలుకని ఆరగించి కుత్రిమ నాలుకగా మారిపోయింది పరాన్నజీవి

Fish Tongue : చేప నాలుక తినేసి కృత్రిమ నాలుకగా మారిన పరాన్నజీవి

Fish Tongue

Fish Tongue : భూమిపై ఉన్న జీవరాశిలో చాలా వరకు మాంసాహారులే ఉంటాయి. అవి ఓ జీవిమీద దాడి చేసి వాటిని తిని తమ ఆకలి తీర్చుకుంటాయి. ఇలా వేటాడే సమయంలో కొన్ని ఊహించని.. ఎప్పుడు చూడని ఘటనలు చోటుచేసుకుంటాయి. ఎరను వేటాడాలి అనుకున్న జంతువు ప్రమాదంలో పడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే, అమెరికాలో ఇటీవల గుర్తించిన ఓ పరాన్న జీవి కథ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది.

చదవండి : Lion Fish : బాబోయ్.. ఈ చేప చాలా డేంజర్.. విషం చిమ్మి మనిషిని చంపేస్తుంది!

టెక్సాస్‌ స్టేట్‌ పార్క్‌లో ఓ పరాన్నజీవి బయటపడింది. అట్లాంటిక్‌ క్రోకర్‌ అనే ఓ జాతి చేప నోటిని పరిశీలించగా.. నాలుక ఉండాల్సిన స్థానంలో ఆ పరాన్న జీవి తిష్టవేసింది. ఆ చేప నాలుకను ఆ పరాన్న జీవే తినేసి.. అనంతరం ఆ చేప నోటిలో నాలుక మాదిరి అది అతుక్కుపోయినట్టు పరిశోధకులు తేల్చారు.

చదవండి : Fish Oil : చేపనూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?