France-UK Train breakdown in Undersea Tunnel : సముద్ర గర్భంలో ఆగిపోయిన రైలు .. ఐదు గంటలు ప్రాణాలు గుప్పిట్లో ప్రయాణీకులు
ఫ్రాన్స్‌లోని కలైస్ నుంచి ఇంగ్లండ్‌లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు ఒక్కసారిగా సముద్ర గర్భంలో ఆగిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణీకులు హడలిపోయారు. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు గంటలపాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా గడిపారు.

France-UK Train breakdown in Undersea Tunnel
France-UK Train breakdown in Undersea Tunnel : ఫ్రాన్స్‌లోని కలైస్ నుంచి ఇంగ్లండ్‌లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు ఒక్కసారిగా సముద్ర గర్భంలో ఆగిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణీకులు హడలిపోయారు. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు గంటలపాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా గడిపారు. కానీ ఎట్టకేలకు ప్రయాణీకులు అందరిని సురక్షితంగా బయటకు తీసుకురావటంతో చావు తప్పి కన్ను లొట్టబోయిందా అన్నట్లుగా బయపట్డారు. మంగళవారం (ఆగస్టు 2022)మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణీకులు డిజాస్టర్ సినిమాను చూసినట్లుగా ఉందని ఆ ఐదు గంటలు ఊపిరి ఆగిపోయిందా? అనే అనుభూతి కలిగిందని చెబుతున్నారు.
ఫ్రాన్స్‌లోని కలైస్ నుంచి ఇంగ్లండ్‌లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు ఇంగ్లిష్ చానల్ కింద ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో? మళ్లీ ఎప్పుడు కదులుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దాదాపు ఐదారు గంటలపాటు ఉగ్గబట్టుకుని ప్రాణాలతో బయటపడతామా? తమవారిని కళ్లతో చూస్తామా?లేదా?అనే భయంతో అల్లాడిపోయారు. చివరికి ఎమర్జన్సీ సర్వీసు ద్వారా ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి మరో ట్రైన్ ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చారు. తరువాత ఫ్రాన్స్ నుండి వచ్చే రైళ్లు ఆరు గంటల వరకు ఆలస్యం అయ్యాయి.
యూరోటన్నెల్ లే షటిల్ సర్వీస్ రైలు అలారంలు ఒక్కసారిగా ఆఫ్ అవడంతో రైలు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఉదయానికి తిరిగి సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఓ అధికారి వెల్లడించారు. రైలు అలారంలు మోగడంతో రైలు నిలిచిపోయిందని దీనిపై దర్యాప్తు చేయనున్నామని తెలిపారు. ఇది చాలా అసాధారణమైన ఘటన అని..ఈ ఘటన తరువాత రైలును సొరంగం నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొచ్చామని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
అండర్‌సీ టన్నెల్‌లో రైలు చిక్కుకుపోవడంపై బర్మింగ్‌హామ్‌కు చెందిన 37 ఏళ్ల సారా ఫెలోస్ అనే ప్యాసింజెర్ మాట్లాడుతూ.. ఇదో భయంకరమైన అనుభవంగా ఉంది..ఇదో డిజాస్టర్ సినిమాలా అనిపించింది అంటూ ఆందోళన ఆనందం నిండిన గొంతుతో తెలిపారు. ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురయ్యామని..కొంతమంది అయితే ప్రాణాలు దక్కుతాయా? అని ఏడ్చేశారని తెలిపారు. అండర్‌సీ టన్నెల్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా..31.5 మైళ్ల పొడవు (ఇందులో 23.5 మైళ్లు ఇంగ్లీష్ ఛానల్ కింద నడుస్తుంది) ఛానల్ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ సొరంగం. ఇది సముద్ర మట్టానికి 246 అడుగుల దిగువన ఉంది.