PM Modi: పోప్ ప్రాన్సిస్‌ను ఇండియాకు ఆహ్వానించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోప్ ప్రాన్సిన్ ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. వాటికన్ సిటీలో ఓ గంటసేపు భేటీ అయిన మోదీ.. పలు విషయాలు చర్చించారు.

PM Modi: పోప్ ప్రాన్సిస్‌ను ఇండియాకు ఆహ్వానించిన మోదీ

Pope Francis

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోప్ ప్రాన్సిన్ ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. వాటికన్ సిటీలో ఓ గంటసేపు భేటీ అయిన మోదీ.. పలు విషయాలు చర్చించారు. 24నిమిషాల పాటు మాత్రమే కుదుర్చుకున్న అపాయింట్మెంట్ గంటసేపు కొనసాగింది. ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని రూపుమాన్పి, పేదరికాన్ని నిర్మూలించాలని అనుకున్నారు.

ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పోప్ ప్రాన్సిస్ తో పలు విషయాలను సవివరంగా చర్చించా. అతణ్ని ఇండియాకు ఆహ్వానించా. అని మోదీ అన్నారు.

ఇండియా ప్రధానిగా ఉన్న సమయంలో 1999వ సంవత్సరం అటల్ బీహారీ వాజ్‌పేయి పోప్ జాన్ పాల్ IIను కలిశారు. తర్వాత మీటింగ్ లో పాల్గొన్న వ్యక్తి మోదీనే. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిష్టర్ డా.జైశంకర్ కూడా మోదీతో వెళ్లారు. 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోడీ కావడం విశేషం.

…………………………………………….: బైక్ కవర్ కప్పుకొచ్చావా.. కాజోల్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

ప్రధాని మోడీ ఫారెన్‌ టూర్‌ బిజీబిజీగా కొనసాగుతోంది. వాటికన్‌ సిటీలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. పోప్‌ ఫ్రాన్సిస్‌తో పాటు వాటికన్‌ సిటీ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన పోప్ ఫ్రాన్సిస్.. ఆలింగనం చేసుకుని అభినందించారు.

ఇటలీ రాజధాని రోమ్‌లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జీ-20 (G20) సమావేశం జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి విసిరిన సవాళ్ల గురించి, యూకేలోని గ్లాస్గోలో వాతావరణ మార్పుల గురించి సమావేశంలో ప్రపంచ దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఇటలీ, యూకే పర్యటనకు వెళ్లే ముందు ప్రకటన విడుదల చేసిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా.. 31 దాకా రోమ్‌లో, నవంబర్‌ 1 నుంచి 2 వరకూ యూకే గ్లాస్గోలో మోదీ పర్యటించనున్నట్లు తెలిపారు.