Pakistan Artist : మోదీని ఓడించాలన్న పాక్ నటుడు

మోదీ ప్రధానిగా తప్పుకుంటేనే మరింత మంది పాకిస్తానీ నటులు భారతీయ సినిమాల్లో భాగం కాగలరన్నారు...

Pakistan Artist : మోదీని ఓడించాలన్న పాక్ నటుడు

Modi Pak

Updated On : January 5, 2022 / 7:36 AM IST

Pakistan Artist : పాక్‌ నటుడు జావేద్‌ షేక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీ తప్పుకోవాలని పాకిస్తాన్ సినీ పరిశ్రమలోని వారు కోరుకుంటున్నారని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో మోదీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ భారతదేశానికి మళ్లీ ప్రధానమంత్రి అయితే, పాకిస్తానీ సినీ తారలు భారతీయ సినిమాలో భాగం కాలేరని ఆరోపించారు జావేద్‌.

Read More : BiggBoss Maanas : బిగ్‌బాస్ మానస్‌తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

జావేద్ షేక్ ఓం శాంతి ఓం సహా పలు భారతీయ సినిమాల్లో నటించారు. ఓం శాంతి ఓం చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌‌కు తండ్రిగా నటించాడు. భారతీయ సినిమాలో భాగం కావడం సంతోషకరమైన విషయమన్నారు. అయితే ఇప్పుడు ఆ అవకాశాలు తగ్గిపోయాయని జావేద్ తెలిపారు. మోదీ ప్రధానిగా తప్పుకుంటేనే మరింత మంది పాకిస్తానీ నటులు భారతీయ సినిమాల్లో భాగం కాగలరన్నారు. అయితే ఈ మధ్య అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో పాకిస్తానీ నటీనటులు నటించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్‌లో పుల్వామా దాడి జరిగిన తర్వాత పాక్‌ నటీనటులకు అవకాశాలు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు.