BiggBoss Maanas : బిగ్‌బాస్ మానస్‌తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ మానస్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మానస్ ని అభినందించారు. బిగ్ బాస్ షోలో మానస్ ఆట తీరు...
BiggBoss Maanas : ఇటీవలే బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ షో పూర్తి అయింది. గతంలో కంటే ఈ సారి కొంచెం ఎక్కువే హడావిడి చేశారు ఇందులో కంటెస్టెంట్స్. ఈ షోలో టాప్ 5లో నిలిచాడు నటుడు మానస్. మానస్ ముందు నుంచి సీరియల్స్ చేస్తూ సీరియల్స్ చూసే వాళ్ళకే తెలుసు. కానీ బిగ్ బాస్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. బిగ్ బాస్ తర్వాత సీరియల్స్ తో పాటు సినిమాలపై కూడా ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. తాజాగా మానస్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు.
ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ మానస్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మానస్ ని అభినందించారు. బిగ్ బాస్ షోలో మానస్ ఆట తీరు చాలా బాగుందని, ఆయన ప్రవర్తన ఎంతో హుందాగా ఉందని, తప్పకుండా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు సంపాదించుకుంటాడని తెలిపి మానస్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మానస్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో నా ప్రయాణం ఇంత బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను హౌస్ లో ఉన్నప్పుడు బయట నుంచి నాకు ఎంతో సహకరించి, ఇప్పుడు నన్ను ఆశీర్వదించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని అన్నాడు.